Monday, December 7, 2015

కుంకుమ బొట్టు ఎందుకు ధరించాలి? ఏ వేలుతో పెట్టుకుంటే మంచిది?

కుంకుమ బొట్టు ఎందుకు ధరించాలి? ఏ వేలుతో పెట్టుకుంటే మంచిది?


మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక్కో అది దేవత ఉన్నాడు. అలాగే 

లలాట అది దేవత బ్రహ్మ. లలాటం బ్రహ్మ స్థానం. బ్రహ్మ దేవుడి రంగు 

ఎరుపు. అందువల్ల బ్రహ్మ స్థానం అయిన లలాటాన ఎరుపు రంగు బొట్టు 

ధరించాలి. అంటే కుంకుమ ధరించాలి.

లలాటాన సూర్య కిరణాలు తాకరాదు. మనలోని జీవి, జ్యోతి స్వరూపుడిగా 

భ్రూ మధ్యమంలోని అజ్ఞా చక్రంలో సుషుప్త దశలో హృదయ స్థానంలో అనగా 

అనాహత చక్రంలో ఉంటాడు.

కుంకుమను ఉంగరం వేలితో పెట్టుకుంటే శాంతి,ప్రశాంతి చేకూరుతుంది. 

నడివేలుతో పెట్టుకుంటే ఆయువు సమృద్ది చెందుతుంది. బొటన వేలితో 

పెట్టుకుంటే శక్తి వస్తుంది. చూపుడు వేలుతో పెట్టుకుంటే భక్తి,ముక్తి కలుగుతాయి.
ప్లాస్టిక్ బొట్టు బిళ్ళలు వంటివి ధరించటం కన్నా కుంకుమ ధరిస్తేనే మంచిది. 

ఎప్పుడైతే నుదుటున కుంకుమను ధరిస్తారో అప్పుడు జ్ఞాన చక్రాన్ని 

పూజించినట్టు అవుతుంది.

No comments:

Post a Comment

Total Pageviews