తన తండ్రిని పున్నామ నరకం నుండి తప్పించే అసలైన పుత్రుడు:
40 ఏళ్ళ కొడుకు, డెబ్బై ఏళ్ళ తన తండ్రి చేయి పట్టుకొని , మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళ్ళి , హోటల్ లో ఓ టేబుల్ దగ్గర తన పక్కనే కూర్చోబెట్టుకొని , ఇద్దరికీ ఇడ్లీ , సాంబార్ తెమ్మని ఆర్డర్ ఇచ్చాడు కొడుకు.
ఆ ఇడ్లీలు తినేటప్పుడు తండ్రి నోటిలో నుండి సాంబార్ కొంత జారి అతని చొక్కా మీద పడింది.
వయసు మీద పడటం వల్ల చేతులు మెల్లగా వణకడం , నోట్లో పళ్ళు సరిగా లేకపోవడంతో రెండు మూడు చోట్ల అలా చోక్కాపై మరకలు పడ్డాయి.
వాళ్ళ టేబుల్ చుట్టు ప్రక్కల తింటూ కూర్చొన్న కొందరు యువకులు తన తండ్రిని , అతని చొక్కాపై పడిన ఆ మరకలను చూసి అసహ్యించుకుంటూ, ముఖాలను ప్రక్కకు తిప్పుకొని ఏదో ఎగతాళిగా మాట్లాడుకున్నారు.
వాళ్ళందరి ప్రవర్తనను చూసినా కూడా , వాళ్ళను ఏమీ పట్టించుకోకుండా తిన్న తర్వాత తన తండ్రిని వాష్ బేసిన్ వద్దకు తీసుకెళ్ళాడు.
తన దగ్గరున్న కర్చీప్ ను నీటితో తడిపి , తన తండ్రి చొక్కా మీద పడ్డ మరకను తుడవడంతో పాటు , అతని పెదవుల ప్రక్కన కొద్దిగా అంటుకొని ఉన్న ఇడ్లీ ముక్కలను కూడా నీట్ గా తుడిచాడు.
తర్వాత కౌంటర్ వద్దకు వెళ్ళి బిల్లును కట్టేసి , తన తండ్రితో పాటు రెండడుగులు ముందుకు వేయగానీ, వెనుక నుంచి ఎవరో పిలిచినట్లుగా అనిపించి వెనుకకు తిరిగి చూసాడు.
అక్కడే ఓ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఓ పెద్దాయన " బాబూ........! ఇక్కడ నువ్వు కొన్ని వదిలి వెళుతున్నావు " అని అన్నాడు.
లేదండీ........, నా బ్యాగ్ నాతోనే ఉంది, నేనేమీ ఇక్కడ వదల్లేదండీ.........! అని అన్నాడు ఆ పెద్దాయనతో......
అప్పుడు ఆ పెద్దాయన , " బాబూ........! నేననేది నీ బ్యాగ్ గురించి కాదు.
ఇక్కడున్న కొడుకులందరికీ కన్నవారిని ఎలా ఓపికగా, ప్రేమగా చూసుకోవాలో అనే ఓ జీవిత పాఠం వదిలి వెళుతున్నావు.......,
అలాగే ఇక్కడున్న ప్రతి తల్లిదండ్రీ ఇలాంటి కొడుకు మాకు కూడా ఒకడుంటే ......బాగుండునే......అనే ఒక మధురానుభూతిని , ఓ తీయని జ్ఞాపకాన్ని వదిలి వెళుతున్నావు" అంటూ........
నెమ్మదిగా లేచి వచ్చి భుజాన్ని తడుతూ ఇలాంటి ప్రేమాభిమానాలున్న కొడుకు ప్రతి కుటుంబానికీ ఉండాలి అని అన్నాడు.
ఆ పెద్దాయన మాటలు విన్న హోటల్ లోని వారంతా నిశ్శబ్దంగా కొడుకు వైపే అలాగే చూస్తూ ఉండిపోయారు...
Love u r parents..
No comments:
Post a Comment