పరమశివుడు తలక్రిందులుగా తపస్సు చేస్తున్న భంగిమలో విగ్రహము.
ఈ పుణ్యక్షేత్రం గురించి చదవండి.
తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా శివలింగం - ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి- భీమవరం యనమదుర్రు:
ఆలయ విశేషాలు, స్థల పురాణం...
దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తలక్రిందులుగా తపస్సు
చేస్తున్నట్లుగా లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడి విశేషం . ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి.
ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి
విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ
పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది.
అలాగే శివుడుకూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని
వదిలెయ్యటమేకాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపో
భంగిమలో కనబడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం,
మోకాళ్ళు, పాదాలు.
No comments:
Post a Comment