శుభోదయం.../\...
లక్ష్మీదేవి నివసించే స్థానాలు.
మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై
చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని
బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన
సమయంలో లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో ఎక్కడ ఉండదో చెప్పింది.
గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గలవారికి ఆ శ్రీమహాలక్ష్మి తన
కటాక్షాన్ని అందిస్తుంది. అతిగా నిద్రపోఎవారి ఇళ్ళల్లోనూ, ప్రాతఃకాల
సమయంలో పూజ చేయని వారి ఇంటిలోనూ లక్ష్మీదేవి నివసించాడు. ఇల్లు
పరిశుభ్రంగా లేకపోయినా, గడపలకు పసుపు రాయకపోయినా, ఆడవారికి
నిషిద్ధమైన 4 రోజులు పూజామందిరానికి దూరంగా ఉండకపోయినా
లక్ష్మీదేవి ఆ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది. ముగ్గు,పసుపు,పువ్వులు,
పాలు, పళ్ళు, దూప, దీప, మంగళ ద్రవ్యాలు లక్ష్మీదేవి నివసించే స్థానాలు
అని పెద్దలు చెపుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల
ఆమె కృప అన్నివేళలా మనపై ఉంటుంది.
No comments:
Post a Comment