హరిదాసు!
ధనుర్మాసం లో వేకువజామునే 'హరిలో రంగహరి' అంటూ కీర్తనలతో మన ముంగిళ్ళ రంగవల్లులే వేదికగా చేసుకుని హరినామ సంకీర్తనతో నిలిచే హరిదాసు సాక్షాతూ విష్ణురూపుడే అని నమ్ముతారు. ఆయన తలమీద అక్షయ పాత్ర లో మనం వేసే బియ్యం మనకు శుభాలను కలిగిస్తుంది. శ్రిమద్రమారమణ గోవిందో హరి అంటూ ఒక కాలు మడిచి వంగి ఆయన అక్షయ పాత్రలో బియ్యం వెయ్యడానికి అనువుగా మోకాలు మీద కూర్చుంటాడు. ఏ ఇంట ముంగిటైనా ఎవరూ లేకపోతె మరో ఇంటికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతే మంచిది కాదు అని ఆయన వచ్చేటప్పటికి ఇంటి ముంగిట చిన్నారులు పెద్దలు బియ్యం పాత్రలతో సిద్దముగా ఉంటారు. పూర్వం పాండవుల వద్ద వుండే అక్షయపాత్రని శ్రీకృష్ణుడు హరిదాసుల పూర్వులకు ఇచ్చాడు అని చెప్పుకుంటారు. అందులో బియ్యం వేస్తె ఆ ఇంట ధన దాన్యాలకి లోటు ఉండదు అని నమ్మకం. ఇలా మన ఘన సంస్కృతి లోని జానపద కళల్ని, కళాకారుల్ని గౌరవిద్దాం! వారిని ప్రోత్సహిద్దాం!! పది కాలాలు పరిరక్షిద్దాం!!!
సత్యసాయి విస్సా ఫౌండేషన్.
ఈ లింక్ క్లిక్ చేసి హరిదాసు దర్శనం చేసుకోండి ఈ ధనుర్మాసం శుభవేళలొ
ఈ లింక్ క్లిక్ చేసి మరో చిన్నారి హరిదాసు దర్శనం చేసుకోండి ఈ ధనుర్మాసం శుభవేళలొ మా చిన్న బాబు చి. ప్రభవ్ ఒక సంక్రాంతికి హైదరాబాద్ శిల్పారామం లో వేసిన హరిదాసు వేషం!
https://www.youtube.com/watch?v=yhea6kGRa4Y
No comments:
Post a Comment