Friday, December 11, 2015

👵బాల్యమా! తిరిగి రా!👼

                 👵బాల్యమా! తిరిగి రా!👼

1.బాలల తీపి గుర్తులును - ప్రాప్తము నొందగ బాధ మర్తురే! బాలురు, బాలికల్ తమకు - బాల్యములోపలి స్నేహ బంధముల్!
గేలియు చేయునట్టి తమ -
 కీలక కేళిలు గోళి లాటలున్! మూలము లన్నియున్ నెమరు- మోదము నిచ్చును మూర్తిమత్వమున్!

2.నాదొక 'చిన్నపల్లె',నది-నాదసు తీర్థము పుణ్యక్షేత్రమౌ!
వైదిక మంత్ర ఘోషలట-
వల్లెలు వేసెడి శిష్య బృందముల్!మోదము నిచ్చు ప్రాకృతిక - మోక్షము పొందెడు దివ్య ధామమై!
నాదు నదీమ తల్లినవ -
నందసు రాగము పల్లవించగన్!

3.కాళేశ్వరమ్మను -
కమనీయ త్రైలింగ! దివ్యక్షేత్రమ్మైన -
తెలుగు భూమి!
గౌతమీ ప్రణీత -
కలియు సరస్వతీ!
సంగమ త్రివేణి -
గంగ గాను!
ఒక పానవట్టమున్ -
ఒదిగిన లింగముల్!
కాళేశ ముక్తీశు -
కరుణ  కలుగ!

రెండు లింగాలు గావెల్గు- లిచ్చునట్టి !
ముక్తి నాథున కునురెండు- ముక్కులుండు !
దర్శ నమ్మును చేయగా -
దరికి జేర్చు!
శివుడు కాళేశ-
ముక్తీశు శీఘ్ర ముగను!
సేకరణ శ్రీ  మురళీధర శర్మ  గారి నుండి.



No comments:

Post a Comment

Total Pageviews