వితండవాదం అంటే ఇదే వెనకటికి ఒకడు "నాకు వెర్రి రోగం పోయింది రోకలి నా తలకు చుట్టండి" అన్నాడట అలా ఉంది. వెర్రివాడి వదరుబోతు తనం. ఇటీవల మన సామాజిక మాధ్యమాల్లో " గోవు దేవుడు కాదు, గోవుని చంపి తినడం పాపం కాదు" బ్రాహ్మలు తినేవారు, మేము తింటాము, మీరూ తినవచ్చు అంటూ ఇలా ఎన్నో వెర్రిమొర్రి మాటలు ఒక ముస్లిం సోదరుడు అనేక పవిత్ర గ్రంధాలయిన ఖురాన్, శ్రీమద్భగవద్గీత ఇంకా పురాణాలలో ఎన్నో శ్లోకాలను ఉదాహరిస్తూ తన జిహ్వ చాపల్యానికి కుంటిసాకులు వెదుకుతూ ధర్మపన్నాలు వెల్లడిస్తున్నాడు, ఆ వీడియో చూస్తే ఇది చదవండి! లేకపోతె అవసరం లేదు. ఎందుకంటే ఆ వీడియో ద్వారా జరిగే విషప్రచార ప్రయోగానికి ఇది విరుగుడు...గోవు దేవుడు కాదు తినవచ్చని చెప్పే ఈ మూర్ఖునికి గోవు సాక్షాత్తు దైవ స్వరూపమని చెప్పే వెయ్యి కారణాలు మనమూ చెప్పవచ్చు. ఇది కొంచెం ఓపికగా చదవండి! అటువంటి మూర్ఖులకి గుణపాఠం చెప్పండి! ఇటువంటి విపరీత బుద్ధులను మొగ్గలోనే తుంచేయాలి! మనం చేసే ప్రతి వెధవపనికి పురాణాలలో సమర్ధించుకోడానికి కొన్నింటిని ఉదహరించవచ్చు మిడి మిడి జ్ఞానంతో విపరీతార్ధాలు తీయవచ్చు. ఉదాహరణకి ఒక్కటే మాట ఉచ్చరణ లోనే అర్ధం మారిపోతుంది ఉదాహరణకు 'దయచేయండి' అనే మాట మర్యాద పూర్వక ఆహ్వానాన్ని, వ్యంగ్యంగా వెళ్లి పొమ్మనే అర్ధాన్ని ఇస్తుంది. సాటి మనుషులనే అమాయకంగా జీహాద్ పేరిట చంపే మాట ఛాందసవాదులకు ఆవు అంటే గౌరవం ఎందుకు ఉంటుంది. లోకంలో అమాయక జీవులను బలిచేస్తారు కానీ క్రూర మృగాల జోలికి వెళ్ళరు, అలా వెళితే వీళ్ళు పోతారు కాబట్టి గోవులన్నా, హిందువులన్నా ఎంత చులకనో చూసారు కదా! దీనికి కారణం మనమే మన పరమత సహనం చేతకాని తనంలా భావించబడుతోంది. అతనికి అటువంటి కుహానా మేధావులకు ఇదే సమాధానం దేశకాలమాన పరిస్థితులను బట్టి కొన్ని ఆచారాలు ఉండేవి. పురాణ ఇతిహాసాలు చెడు నుంచి మంచి వైపు మరలించె క్రమంలో కొన్ని గాధలు ఆచార వ్యవహారాలూ ఉదాహరించాయి. శ్రీ రాముడు ఏకపత్నీ వ్రతుడు, శ్రీ కృష్ణుడు బహుభార్యవ్రతుడు ఇద్దరూ దేవుళ్ళే అలాగే సీతాదేవి, ద్రౌపదీ దేవి ఇద్దరూ మహా పతివ్రతలే అలా అని మన విపరీత కోరికల సమర్ధనకు నాకు కృష్ణ భగవానుడు నా ఆదర్శం అనుకునే వెర్రివాడికి శ్రీకృష్ణ జన్మస్థానమే గతి. దేశ కాల మాన పరిస్థితులను బట్టి ఒకప్పుడు ఒప్పుగా చెప్పబడేది తరువాత తప్పుగా చెప్పబడింది. ఒకప్పుడు సతీసహగమనం ఆచారం ఒప్పు. అది ఇప్పుడు తప్పు. ఒప్పు ఎలా అయ్యిందంటే రాజవంశాలలో రాజు ఓడిపోయినప్పుడు అంత:పుర స్త్రీలను చెరపట్టి వారిని నరక యాతనకి గురిచేసేవారు ఆజీవనం కన్నా చావడమే మేలు అనుకునేవారు, కొంతమంది రాజ్యం విడిచి అడవులుపట్టిపోయేవారు తమను తమ వారిని రక్షించుకోవడం కోసం అలా చెయ్యలేని వారు మరణమే శరణ్యం అని సహగమనం చేసేవారు. ఈ కాలంలో కూడా చిన్ని చిన్ని కారణాలకే ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడం మనం ప్రతి నిత్యం చూస్తూనే వున్నాం, వింటూనే ఉన్నాం. ఇది వారికి సంఝాయిషీగా కాదు, ఇటువంటి వితందవాదుల మాటలకి అమాయకులు వారి ఉచ్చులలో తేలికగా పడకుండా ఉండెందుకు ఇంత సుదీర్ఘ వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఇలాంటి వినాశకాలే విపరీత భుధ్ధి ప్రచారాలను మొగ్గలోనే తుంచేయాలి, తిప్పికొట్టాలి. ఇటీవల గోమాంసానికి సంబంధించిన చర్చ తారాస్థాయికి చేరింది. గోవధకు వ్యతిరేకంగా కాదు, అనుకూలంగా ..గోవధకు అనుకూలంగా మాట్లాడే కుహనా లౌకికవాదుల వాదన చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇతరుల ఆహార పద్ధతుల్ని గౌరవించాలని వారి వాదన. గోవధ ను వారి మతం ఏ మాత్రమూ సమర్థించడం లేదు. పైగా వద్దని కొన్ని సందర్భాల్లో మహమ్మద్ ప్రవక్త తో సహా ఇతర ప్రవక్తలు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. హిందూ ముస్లింలు సఖ్యతగా ఉండడం ఏ మాత్రమూ నచ్చని ఆంగ్లేయులు మొట్టమొదటి సారిగా కలకత్తాలో గోవధ శాలను ఏర్పాటు చేసి, గోమాంసాన్ని ముస్లింలు తినేటట్లు ప్రోత్సహించి, ఈ ఇరువర్గాల మధ్య వైరాన్ని సృష్టించారు.
ఇకపోతే వేదాలలోనే గోవధను చెప్పారని అతని వాదన అది అతని అరకొర వేదపరిజ్ఞానం. కావాలంటే మనమూ ఉదహరించవచ్చు వేదంలో గోమాత యొక్క మహాత్మ్యం ఇలా ...ఋగ్వేదంలో గోసూక్తం ఉంది. అంటే గోవును స్తుతించే సూక్తం. గోసూక్తం - ఇందులో గోవు యొక్క మహాత్మ్యం సవివరంగా చెప్పబడినది. పురుషసూక్తం, శ్రీ సూక్తం, మన్యుసూక్తం వంటి దేవతా సూక్తాలతో గోసూక్తం చెప్పడంలోనే గోవు విశేషం తెలుస్తుంది. గోవు రుద్రులకు తల్లి, వసువులకు కూతురు, ఆదిత్యులకు కోడలు, నెయ్యి రూపంలో అమృతానికి భాండాగారం అని చెప్పారు.
ఇంకా ఇతర సందర్భాల్లో, "అఘాసు హన్యన్తే గావః" అని చెప్పారు. అంటే పాపాల్ని గోవులు నిర్మూలిస్తాయి అని అర్థం. దీనిని వక్రీకరించిన అతి మేధావులు, "అఘాసు" అనే పదాన్ని తొలగించి "హన్యన్తే గావః" అని మాత్రమే తీసి "గోవులను చంపుతున్నారు" అని ఋగ్వేదంలో ఉన్నట్లుగా వివరిస్తారు.
అఘాసు - పాపములు.
హన్యన్తే - నిర్మూలిస్తాయి.
గావః - గోవులు.
ఇందులో పాపములు అనే పదాన్ని తీసినట్లైతే, "గోవులను చంపుతున్నారు" అనే అర్థం వచ్చేస్తుంది. వారికి కావల్సింది ఇదే.
పరాశర, మనుస్మృతులలో గోవు యొక్క గొప్పదనాన్ని ఎంతో విస్తారంగా చెప్పారు. "ఒక కూరగాయల కొట్టులో యజమాని దగ్గర లేనప్పుడు గోవు వచ్చి కూరగాయల్ని తింటూ ఉంటే, యజమానికి చెప్పరాదని, చెప్తే దోషమని చెప్పారు. దీని బట్టి పరాశరాదులు గోవుకు ఎంత పెద్ద పీట వేసారో అర్థమవుతోంది.
జై గోమాతా......
ఆవు గోవు అని పిలుస్తూ అమ్మగా భావించి గోమాతగా ఆరాధించడం అనాదిగా మన భారతీయ తత్వం. అమృతం సేవిస్తున్నప్పుడు బ్రహ్మ నోటి నుంచి కారుతున్న నురుగ ద్వారా ఆవులు జన్మించాయట, ఆవుల పాలతో సముద్రం ఉద్భవించింది. సముద్ర మధనం జరిగినప్పుడు కామధేనువు అవతరించింది. గోమాత శరీరంలో 33 కోట్ల దేవతలు నివసిస్తారు, అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం. బ్రహ్మ పురాణంలో వ్యాస భగవానుడు సమస్త గోవులు విష్ణు స్వరూపం, అన్ని అవయాలలో భగవానుడైన కేశవుడు విరాజమానుడై ఉన్నాడు. ఆవు ముఖంలో నాలుగు వేదాలు నిక్షిప్తమై ఉన్నాయని పద్మ పురాణం చెప్పింది. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మ గోపాలకుడిగా వ్యవహరించి గోపాలుడు, గోవిందుడు అని పేరుపొందాడు. గోప బాలురతో కూడిన గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇంద్రుని ప్రకోపం నుంచి గోవులను, సమాజాన్ని రక్షించాడు. ఆవు పాలను తాగిన శ్రీకృష్ణుడు జ్ఞానాన్ని పెంచుకుని లోకాలను ఉద్ధరించడానికి గీతా జ్ఞానాన్ని ప్రబోధించాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షం కావాలంటే ఆయనకు ఇష్టమైన గోవులను పూజిస్తే చాలు. ఆవును దర్శించి దినచర్యలు ప్రారంభించడం ఎంతో శుభశకునంగా భావించే వారు. గోవు సాధుత్వానికి, పవిత్రతకు, శుభానికి, ఆరోగ్యానికి సంకేతం. అలాగే గోవు అందించే పదార్ధాలు కూడా అంతే విశిష్టత కలిగి ఉన్నాయి. ఇతర ప్రాణుల మల మూత్రాలు అసహ్యకరం. కానీ గోమూత్రం గోమయం (పేడ) "గోమూత్రం గోమయంచైవ క్షీరదధి ఘ్రుతంతథా| పంచరాత్రం తదాహారం పంచగవ్యేన శుధ్యతి"|| (వశిష్ఠ స్మృతి.11-380) ...ఎవరైతే పంచ గవ్యములయిన గోమూత్రం, గోమయం, క్షీర, పెరుగు, నెయ్యిలను ఆహారంగా గ్రహించి పంచరాత్రులు ఉపవాసం చేస్తారో, వారి సకల మహాపాపములు తొలగిపోవునని స్మృతి వాక్యము. సమస్త వేదాలు ఆనందంతో గోవులను స్తుతిస్తాయి. రుగ్వేదం ఆవును అషున్యా అని.. గోవు ఎవరికీ సాటి లేనిదని యజుర్వేదం.. ఆవు సంపదలకు పుట్టినిల్లని అధర్వణ వేదం వర్ణించాయి. అన్నీ వేదాల్లోనే ఉన్నా సైన్సు నే వేదంగా భావించే యుగంలో ఉన్నాము కనుక ఆవు పేడ చెడువాసన లేనిదేకాక అనుకూల శక్తిని వెల్లడిస్తుందని సైన్స్ కూడా అంగీకరించింది. భారతీయ వ్యవసాయంలో ఈ రెండింటితో ఎరువులు, క్రిమిసంహారక మందులు అవసరం లేకుండా భూసారాన్ని కాపాడి ఎక్కువ దిగుబడి పొందవచ్చు. మొక్కలకు మరియు చెట్లకు ఆవు మూత్రం తో ఆవుపేడ తో నిండిన గడ్డిని పెంటకుప్పగా ఇంటి పెరడులో ఒక మూల చేర్చి దానిని మొక్కలకు పంట పొలాలకు ఎరువుగా ఉపయోగించే వారు. అలాగే ఆవు మల మూత్రాలను. ఔషదాలలో ఆవు మాత్రం ఎంతో వైభవాన్ని కలిగివుంది. యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలలో మరియు పూజలు, శుభకార్యాలు జరిగే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. నెయ్యితో యజ్ఞయాగాదులు నిర్వహిస్తే రేడియో ధార్మిక కిరణాల నుంచి రక్షణ అభిస్తుంది. ఇండ్లల్లో వాకిళ్లను ఆవుపేడతో అలికితే వారు రేడియో ధార్మిక కిరణాల నుంచి సురక్షితంగా ఉంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది, గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తారు. ఆ నూతన గృహంలో గోవు మల మూత్రాలు విసర్జిస్తే ఎంతో శుభ శకునం గా భావిస్తారు. ఇంట్లో ఆవు ఉంటే మన ఒంట్లో ఒక్క రోగం కూడా ఉండదు. వైద్య శాస్ర్తానికి అర్థం కాని రోగాలు సైతం తన మూత్రంతో తరిమికొట్టే శక్తి గోమాతకు ఉంది. ఆవు పేడను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి గోబర్గ్యాస్ యంత్రాలను ఏర్పర్చుకుని పొయ్యి వెలిగించుకోవచ్చు. యంత్రాలను నడిపించగల శక్తి ఉంటుంది. విద్యుత్ ఉత్పత్తి, దేశీయ ఎరువులు తయారవుతాయి. ఆక్సిజన్ తీసుకుని మళ్లీ ఆక్సిజన్ వదిలే శక్తి కలిగినది గోమాత. ఆమెరికా దేశస్థుడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి మన ఆవుపై పేటెంట్స్ తీసుకుని మనకే మందులు అమ్ముతున్న విషయం తెలిసిందే. అందుకే ఆవు హిందువులకే కాకుండా విశ్వమంతటికీ తల్లి లాంటిది. మానవులందరి పట్ల సమాన మమతానురాగాలు కురిపించేది ఆవు. సృష్టిలో ప్రాణులందరికి తల్లిగా సుఖమయ జీవనాన్ని అందించేది ఆవు మాత్రమే. మానవ జాతికి ఆప్తమిత్రుడు ఆవు. అమ్మ ఆవు ఇల్లు ఈశ్వరుడు అని గంగి గోవు పాలు గరిటడైనను చాలు కడవడైన నేమి ఖరము పాలు అని చిన్నప్పుడే చదువుకున్నాము, గోధూళి వేళ అని తెలుసుకున్నాము.
హజరత్ మహ్మద్ ఆవు పాలలో రసాయనం, ఆవు నెయ్యిలో అమృతముందని, దాని మాంసం తింటే రోగిస్టులవుతారని హెచ్చరించాడు. ఏసుక్రీస్తు ఒక ఎద్దును వధిస్తే ఒక మనిషిని చంపినట్లుగా భావించాలన్నాడు. గాంధీజీ గోరక్షణ స్వరాజ్య ప్రాప్తి కంటే ప్రముఖమైనదిగా పేర్కొన్నారు. గోసంతతిని కాపాడితే ఈశ్వరుడు సృష్టించిన ప్రాణకోటిని రక్షించినట్టే.. స్వామి దయానంద సరస్వతి గోకరుణా నిధిలో ఒక ఆవు తన జీవన కాలంలో లక్షల మందికి పైగా ఒక పూట భోజనాన్ని సమకూర్చగలదు. దానిమాంసంతో మాత్రం 80 మంది ఒక పూట కడుపు నింపుకోగలరని వాఖ్యానించారు. బోళా శంకరుని వాహనం నంది. రుషభ దేవుని చిహ్నం ఎద్దు. శివ మందిరాలలో నంది ప్రతిష్ఠితమై ఉంటుంది. గోస్వామి తులసీదాసు ధర్మార్థ కామ మోక్షాల ఫలాలు ఆవుయొక్క నాలుగు పొదుగు స్థానాలలో నిక్షిప్తమై ఉన్నాయని అభివర్ణించారు. సంత్నామ దేవుడు ఢిల్లీ పాదుషా కోరిక మేరకు మృతిచెందిన గోవును బతికించి అందరిని అబ్బురపరిచారు.
సిక్కుల పదవ గురువు గోవిందసింహుడు చండీదివార్లో గోరక్షణ కోసం దుర్గాభవాని నుంచి దీవెనలు పొందారు. హిందువులు గోపూజ జరిపితే పారశీకులు ఆంబోతును ఆరాదిస్తారు. అక్కడి ప్రాచీన నాణేలపై, పిరమిడ్లపై ఎద్దుల చిత్రాలను చిత్రించేవారు. జైనుల ఆగమాలలో గోవు స్వర్గంలో ఉండదగినదని, దానిని సంహరించతగదని జైనులు పేర్కొన్నారు. భగవాన్ మహావీరుడు గోవులను కాపాడకుండా మానవులను రక్షించడంలో అర్థం లేదన్నారు.

సూర్యవంశ రాజు ఐనటువంటి, దిలీపునకు చాలాకాలం వరకు సంతానం లేకపోవడంతో వసిష్ఠ మహర్షిని ఆశ్రయించగా, ఆయన దివ్యదృష్టితో చూసి, దేవాసుర యుద్ధంలో దేవతలకు సహాయం చేసిన దిలీపుడు భూలోకానికి తిరిగి వస్తూ ఉండగా, మార్గమధ్యంలో కామధేనువుని చూసి కూడా నమస్కరించనందుకే కామధేనువు శపించిందని, ఇందుకే సంతానం లేదని గ్రహించి, గోసేవ చేయమని చెప్పగా, ఆరు మాసాల పాటు సతీసమేతంగా గోసేవ చేసి, పుత్రవంతుడయ్యాడు.
యజుర్వేదంలో గోవుకు ఎవరూ సాటిరారని చెప్పబడినది.
మహాభారతంలో అనుశాసన పర్వములో భీష్ముడు గోవు గురించి ఇలా చెప్పాడు. "గోభిస్తుల్యం న పశ్యామి ధనం కించిదిహాచ్యుత" గోవుతోసమానమైన సంపద లేదు. గోవుకు సంలబంధించిన కీర్తన, శ్రవణం, దానం, దర్శనం అన్నీ పుణ్యప్రదమైనవే.
పద్మపురాణంలో గోవు భౌతిక, ఆధ్యాత్మిక ఉన్నతిని ఒసంగునని, సంపద నొసంగునని, సర్వ తీర్ధఫలదాయకమని, ఆవు ముఖములో నాలుగువేదములున్నవని, చెప్పబడినది.
స్కాంద పురాణంలో గోవులో సర్వదేవతలు, సర్వతీర్ధాలు, 14 లోకములూ ఉన్నాయని చెప్పారు. గోవు పేడ యమున, గోవు మూత్రము నర్మద, గోక్షీరం గంగ అని చెప్పారు. గోవును క్షోభ పెడితే లోకము నశిస్తుందన్నారు.
దేవీ భాగవతంలో గోమాత "సురభీదేవి" అంశ అని చెప్పబడినది. పరాశక్తి సురభీ దేవిగా గో స్వరూపముగా ఆవిర్భవించిందని చెప్పబడినది. బ్రహ్మ పురాణంలో వ్యాసుడు సమస్త గోవులూ విష్ణు స్వరూపమని చెప్పారు.
కాశీ ఖండంలో(కాశీ ఖండం రెండవ అధ్యాయం 75వ శ్లోకం) గోవు త్రిమూర్తులకు అత్యంత ప్రీతికరమైనదని, బ్రహ్మదేవుడు దేవతలకు ఋషులకు చెప్పారు. బ్రాహ్మణులు, గోవులుఒక్కటే అని కాలక్రమములో అవి రెండుగా మారాయని, విప్రులలో మంత్రాలు, గోవులలో యజ్ఞానికి ఉపయోగపడే హవిస్సు ఉంటాయనిచెప్పారు.
గతంలో ఒక ఋషి పుత్రులు శ్రాద్ధం పెట్టడానికి ఏమీ దొరకక, కరువు విలయతాండవం చేస్తున్న సమయంలో తప్పనిసరై గోవును వధించి, శ్రాద్ధం చేస్తారు. అక్కడ పితృదేవల పై వారికి ఉన్న భక్తికి వారు సంతుష్టులయ్యారే కానీ, గోవును చంపినందుకు కాదు.
యేసు క్రీస్తు గోవును చంపితే మనిషిని చంపినట్లే అని చెప్పాడు.
గౌతమ మహర్షి పై అసూయ పడ్డ ఇతరులు, ఒక బక్క చిక్కి శల్యమైన ఒక గోవును మరణానికి ఆసన్నమైనపుడు ఆయనకు చెందిన తోటలో వదలగా అది అక్కడ మరణించింది. ఆ గోహత్య పాపం తనకే వస్తుందని చాలా భయపడిన గౌతముడు గొప్ప తపస్సు చేసి దానిని పోగొట్టుకొన్నాడు.
గోవుకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.
“ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!:
ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.
గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–
నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll
భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….
గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll
భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll
భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….
ఇంత విస్తారంగా చెప్పిన గోమహత్యాన్ని విడిచి, వారి తప్పును సమర్థించుకోవడానికి మిడి మిడి జ్ఞానంతో అవే వేదాల్ని వక్రీకరించడం హాస్యాస్పదం. విజ్ఞులు ఆలోచించండి! ఇటువంటి దుష్ప్రచారాలని తిప్పికొట్టండి!

No comments:
Post a Comment