Saturday, December 5, 2015

పాపాయి ఎందుకు ఏడ్చింది ?

                        పాపాయి ఎందుకు ఏడ్చింది ?
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
7 నెలల పాపాయి అరగంట నుంచి ఏడుస్తోంది ? ఎందుకో అమ్మకు అంతుబట్టట్లేదు...
ఆకలి వేస్తోందా అంటే ఇంతకు ముందేగా పాలు తాగింది...
కడుపు నొప్పిగా ఉందేమో, అని కడుపు నొక్కి చూసింది...
ఎక్కడైనా పారాడుతూ దెబ్బ తాకిందేమో, అని ఆత్రంగా ఒళ్ళంతా నిమిరి చూసింది...
తల లోపల ఎక్కడైనా దెబ్బ తాకిందేమో అని అంతా తడిమి చూసింది...
పాపాయికి ఇష్టమైన బొమ్మ ఇవ్వబోయింది...
దోబూచులు ఆడి నవ్వించబోయింది...
ఎత్తుకుని అటూ ఇటూ తిప్పింది...
ఉహు... ఎంతకీ ఏడుపు ఆపదే... మొండి పాపాయి...
గట్టిగా కోప్పడింది... పాప ఇంకా ఏడ్చింది...
తనూ ఇప్పుడేగా అమ్మయ్యింది... పాపాయికి ఏం కావాలో తనకు మాత్రం ఏమి తెలుసు... ఏమి కష్టం వచ్చిందో అని ఆ తల్లి మనసు విలవిల లాడుతోంది.
అప్పుడు గుర్తొచ్చింది... పాపాయి పారాడుతూ... తన బుల్లి వేళ్ళతో దొరికినవి అన్నీ ఏరుకు తింటుంది కదా ! ఇందాక వంటింట్లో ఆడింది... నోట్లో ఏమైనా ఉందేమో...
వేలు పెట్టి నోరంతా తడిమిన అమ్మకు పాపాయి నోట్లో ఏం దొరికిందో తెలుసా ?
పచ్చిమిరపకాయ్ ముక్క... వెంటనే పాపకు పంచదార తినిపించి, నీళ్ళు పట్టి, గుండెలకు హత్తుకుని ఓదార్చి... చిట్టి పాపతో కలిసి హాయిగా నవ్వింది...
మీకూ మీ పిల్లలతో ఇటువంటి సందర్భాలు ఎదురయ్యయా ?

No comments:

Post a Comment

Total Pageviews