Friday, December 25, 2015

కోపిష్టి మొగుడా మీరు కాస్తిది చదవండి!!!

కోపిష్టి మొగుడా మీరు కాస్తిది చదవండి 
******************************************
అర్ధాంగి ,మనలో అర్ధ భాగం ,మనదో కన్నయితే ఆమెదో కన్ను , ఆ కన్నులో నీరొలికితే మన కన్నులో నీరొలికినట్టే.
చీటికి మాటికి మనం ఉప్పెక్కువయ్యిందని , కాఫీ చల్లారి పోయిందని , అన్నం మాడి పోయిందని భార్యను కసురుకుంటూ వుంటాం [ నేను కుడా]
అబ్దుల్ కలాంగారు చెప్పిన ఆయన నిజజీవితంలోని సంఘటన ఆయన చెప్పినది కాస్త వినండి.
అబ్దుల్ కలాంగారి మాటల్లో
" నా చిన్నప్పుడు ఒక రోజు మా అమ్మగారు పనికెల్లొచ్చి రొట్టి చేసి నాన్నకిచ్చారు , ఆ రొట్టి కాస్త మాడి వుంది , పాపం అమ్మ మళ్ళీ ఇంకొ రొట్టి వేస్తానంది కాని నాన్న అబ్బే నాకు కాస్త మాడిన రొట్టే ఇష్టం , భలే రుచిగా వుంటుంది అంటూ తినేసారు , నాకది కాస్త ఆశ్చర్యంగా అనిపించింది , మేమిద్దరం పైకి మేడమీదకెళ్ళాం పడుకోటానికి ,అప్పుడు నేను నాన్న నడిగా నాన్నా నీకు నిజంగా మాడిన రొట్టి ఇస్టమా అని , దానికాయన నవ్వుతూ మనది మధ్య తరగతి కుటుంబం , అమ్మా , నేను ఇద్దరం పని చేస్తున్నాం , అమ్మ పని నుంచి వచ్చి , వంట చేసి మనకు పెట్టి , తరవాత ఇల్లంతా సర్ధుకుని పడుకోవాలి , ఎంత పనో ,ఒక మాడిన రొట్టి వల్ల నష్టమేమి లేదు , కాని మాటల వల్ల మనసు గాయమైతే ఆ గాయం మానడానికి సమయం పడుతుంది , ఇప్పుడు నేను రొట్టి మాడిందని కోపగించుకుని తిట్టి అది మనసులో గాయమయ్యి , తను బాధపడి , ఆ గాయం మానడానికి కొన్ని రోజులవుతుంది , దానికి బదులుగా ఒక రోజు నేను మాడిన రొట్టి తినడం వల్ల తప్పేమి లేదని అన్నడా తండ్రి , ఎంతటి ఉన్నతమైన ఆలోచన , ఎంతమందిలా ఆలోచిస్తారు.
రేపటినించి ఇలా ఆలోచిద్దామా !
చక్కని కథ. ఇలాంటి కథలు, అనుభవాలు  చదివి కొంతమంది అయినా మారితే బావుంటుంది.

వుండండి ఇంకో కధేమన్నా వుందా అని చూస్తా !!

smile emoticon
-

No comments:

Post a Comment

Total Pageviews