నేను, చిన్నారి లాలిత్య గోవు మాలక్ష్మి! ఈ రోజు మా ఇంటి కిందకి వచ్చింది
ఈ గోవు మాలక్ష్మి! మా కింది వారి మనవరాలు చిన్నారి లాలిత్య నేను గోవు
మాలక్ష్మి! పిల్లలూ, ఆవులూ, దేవుడూ చల్లని వారే! కల్ల కపట మెరుగని
కరుణామయులే!! ఆ గోవులని రక్షించ మని చెప్పాయి సర్వమతాలు
భక్షించమని ఏ మతమూ చెప్పలేదు! చెప్పదు!! వందే మాతరం!
వందే గోమాతరం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.
గోవుకు ఆహారాన్ని ఇచ్చేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠి౦చడ౦ శుభకర౦.
“ప౦చభూతశివే! పుణ్యే! పవిత్రే! సూర్య స౦భవే!
ప్రతీచ్ఛేమ౦ మయాదత్త౦ సౌరభేయి! నమోస్తుతే!!:
ప౦చ భూతాలకు శుభాన్ని కలిగి౦చే పుణ్యస్వరూపిణీ! పవిత్రురాలా! సూర్యుని ను౦డి కలిగినదానా! (సౌరశక్తిలోని దివ్యత్వ౦ గోవులో ఉన్నదని భావ౦). నేనిస్తున్న ఈ ద్రవ్యాన్ని స్వీకరి౦చు. సురభీ వ౦శ౦లో కలిగిన తల్లీ! నీకు నమస్కారము.
గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–
నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll
భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….
గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll
భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..
సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll
భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము…
No comments:
Post a Comment