Monday, December 7, 2015

పుష్పవిలాపం స్ఫూర్తి తో మిత్రులు శ్రీ రామకృష్ణగారు వ్రాసిన గోవిలాపం మీ అందరికోసం!!!!



🔔 హిందూ ధర్మ చక్రం 🔔
🔔 గోవిలాపము ! 🔔  ( నా మిత్రులు శ్రీ రామకృష్ణ గారి రచన. పుష్పవిలాపం స్పూర్తి ) 🔔
🔔 నీకారగింపుకై పాలుపటుకొద్దామని ఉదయాన్నే గోశాలకెళ్ళాను ప్రభూ!బాలభానుని నులివెచ్చని వెల్గులతో గోశాల కళకళ లాడుతోంది. లేగదూడలు వాటితల్లిచెంతన హాయిగా ఆడుకొంటున్నాయి. అప్పుడు-
నేనొక ఆవుకడనిల్చి 
గోవత్సము లాగి కట్టి
పాలింతను పితకబోవ
ఆలేగయు జాలిగ నన్నుజూసి
నాపాలను గొనిపోదువాయంచు కన్నీరించెను దీన చూపులన్-
నాతడిచిత్తపు లోతులందెదో చివుక్కుమన్నది-
గో విషాద గీతమై!!
అంతలో ఒకలేగదూడ బెదురుగొంతుకతో నన్నుచూసి ఇలా అన్నది ప్రభూ!
జీవముగల్గు కొన్నిరోజులన్
బదుకిచ్చిన అమ్మచెంత జాతీయత తెల్సుకొందుము-
మరి ఈడుపైబడుచుండ స్వేచ్చమై గ్రాసము
నెమరువేయుచు మురియుచుందుము 
ఆయువు తీరినంతనే-
మూగగ తనువీడెదము
మమ్మిడు ఇరుకగు పాకనేలపై!
ఎందుకయ్యా మాపేదబదుకులపై కక్షకట్టావ్?
మేము నీకేకష్టం కల్గించాం?
నేలను గారవింతుము సారము పెంచి
మమ్మాశ్రయించెడు పసిపాపల 
బొజ్జనింపెదము కమ్మటి పాలతో-
వర్ణాశ్రమ ధర్మాలకు శుభము గూర్తుము-
ప్రేమమూర్తుల మమ్ము- ఆగుము... చంపబోకుము
మానవత్వము మరవనేర్తువే?
అపుడొక కపిల గోవు కన్నీటితొ ఇలా అన్నది ప్రభూ?
కరకు పాశాలతో గొంతుకురిబిగించి
లేగల్నన్నిటిని ఆవల పెట్టీ - కట్టీ
పితుకు కొందురు కడవల క్షీరమెల్ల-
అకటా! దయలేకపోయె మీమనసుకింత!
మావెలలేని స్వచ్ఛ విశిష్ట వైభవౌ ఓషధులెల్ల
మీకై త్యజించి కృశించి నశించిపోయె
మాసంపదలెల్ల కొల్లగొని ఆపై-
మమ్ముల కసాయిల కిచ్చివేతురుగదా...
నరులకింతను నీతియున్నదా?!
ఓహో! మీరు మానవత్వమున్న నాగరికులు కాబోలునే!
ఓయీ మానవుడా!
గాంధి వెలసిన భూమిలో పుట్టినావు
దయ నీలోన కొంతైన కానదయ్యె!
గోజాతిని బలిజేయు హంతకుండా!
మలినమై పోయె నీ మనషి జన్మ!
అని విలపించు గోమాతల బాధ జూసి పాలు తేలేక వట్టిచేతులతో వచ్చిన నన్ను మన్నించుము ప్రభూ!
ఈ గోజాతి సదా రక్షింప బదునటుల నీ అమృతచూడ్కులు వాటిపై వర్షింపజేయుము ప్రభూ! ప్రభూ! ప్రభూ!
( కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిగారికి వారిచ్చిన స్ఫూర్తికి చూపిన మార్గానికి కృతజ్ఞతలు )
గోఅక్రందనలు మనవత్వానికి గొడ్డలిపెట్టు!
గోవధను అరికట్టుదాం. మన సంస్కృతిని కాపాడు కొందాం.గోవిందుని అనుగ్రహం పొందుదాం. గోమాత వర్థిల్లాలి!!
మిత్రులందరూ షేర్ చేసి తోడ్పడ గలరని ఆశిస్తూ...




No comments:

Post a Comment

Total Pageviews