Saturday, December 26, 2015

శ్రీ అయుత చండియాగ దర్శనభాగ్యం 25-12-2015

మన తెలంగాణా ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నభూతో నభవిష్యతి అన్న చందంగా అత్యంత శ్రద్ధాభక్తులతో నిర్వహిస్తున్న శ్రీ అయుత చండియాగ దర్శనభాగ్యం మాకు నిన్న లభించింది. ఈ సందర్భంలో నా మనోభావనాలు మీతో...లక్షలాది మంది హాజరయ్యే ఇటువంటి మహా కార్యక్రమాలలో నిర్వాహకులు ఎన్ని కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా ప్రజలలో కొంత సంయమనం, ఓపిక, సహనం వంటివి కూడా అవసరం. నిర్వాహకులు పదే పదే విజ్ఞప్తులు పలు సూచనలు చేస్తున్నా, మరో వైపు మంత్రి హరీష్ రావు సైతం ఇటు అటూ కలియ తిరుగుతూ ప్రజలకు విజ్ఞప్తులు చేస్తున్నా, మూడు నాలుగు చోట్ల విపరీత మైన తొక్కిసలాట జరిగే పరిస్థితులు కన్పించాయి. అది ఒక ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమం కాళ్ళకి చెప్పులతో రావడం, ఇష్టం వచ్చినట్లు సెల్ ఫోన్ లతో ఫోటోలు తీయడం, గంటలతరబడి యాగశాలలోనే వుండిపోయి యాగాన్ని కాక ప్రముఖుల్ని చూడడం, ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చెయ్యడం నేను కొంత మందిని మందలించడం వారించడం చేసాను. పుష్కరాలు, ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొనే భక్తులకు ముఖ్యమైన మనవి ఏమనగా, కొంత సమయం వెచ్చించండి 1 గంట 2 గంటలు ఎదురు చూడగలిగితే కొంత రద్దీ తగ్గి సులువుగా దర్శనం చేసుకోవచ్చు, వరుస క్రమ(క్యూ) పద్ధతిని అతిక్ర మించవద్దు. హోదాలు, భేషజాలు వద్దు, పిల్లలకి, ఆడవారికి, వృద్ధులకి సహాయం చెయ్యండి. ఎప్పటి కప్పుడు నిర్వాహకులు భద్రతా సిబ్బంది. సూచనలు సలహాలు పాటించండి, వదంతులు నమ్మకండి, విద్యుతు తో పనిచేసే పరికరాలకి దూరంగా ఉండండి. ఒక విహార యాత్రకి వెళ్ళినట్లు కాకుండా త్రికరణ శుద్ధితో, భక్తి భావంతో, భగవన్నామస్మరణతో అంతర్బహిర్ శుద్ధితో దర్శనం చేసుకోండి. అక్కడ జరిగే కార్యక్రమంలో దేవీ దేవతలే వి.ఐ.పి లు మిగతా వారు ఎంత వారైనా సామాన్యులు గానే భావించాలి. క్రమశిక్షణతో శ్రద్ధాభక్తులతో దర్శించుకుని ఆయా దేవతల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదురు గాక!! తిరిగివస్తున్నప్పుడు వర్గల్ శ్రీ విద్యా సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నాము ఆ దేవిని స్తుతిస్తూ పోతన, మరి కొందరు కవుల పద్యాలు పాటలు ఆలపించే భాగ్యం లభించింది. మా ఎస్టేట్ కి వచ్చేసరికి అయ్యప్ప స్వామి శోభాయాత్ర సాగుతోంది. ఆ దర్శనం భాగ్యం కూడా లభించింది! ఈ చిత్రాలు కొన్ని మీకోసం!! వీక్షించండి! సర్వేజనాస్సుఖినోభవంతు!!! సమస్త సన్మంగళాని భవంతు!!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.






















No comments:

Post a Comment

Total Pageviews