Thursday, April 30, 2015

మన దేశీయ ఉత్పత్తులను బతికిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

" శ్రేయాన్‌ స్వధర్మో విగుణః పరధర్మాత్‌ స్వనుష్ఠితాత్‌ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ॥
ఎంత చక్కని దైనా ఇతరుల ధర్మం ఆచరించడం కంటే లోటుపాటులున్నా తన ధర్మం పాటించడమే మేలు, పరధర్మం భయభరితం, స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే" అని గీతాచార్యుడు చెప్పినవి మననం చేసుకుందాం. కట్టు, బొట్టు, తిండి ఇలా అన్నిటా మన సంస్కృతిని విడిచిపెట్టి పరాయి సంస్కృతిని గుడ్డిగా అనుసరిస్తున్నాము. ఇప్పుడు చెప్పండి. మన ఎదురుగా తీసే చెరుకురసాన్ని, మన ఎదురుగా కొట్టి ఇచ్చే కొబ్బరిబొండాన్నిఎవరైనా కలుషితం చెయ్యగలరా? అందుకే బతికుంటే బలుసాకు తినచ్చు అంటారు, బ్రతుకుదాం! మన దేశీయ ఉత్పత్తులను బతికిద్దాం!! సత్యసాయి విస్సా ఫౌండేషన్.

of Maaza, as a worker from the company has
added his blood contaminated with HIV (AIDS). It
ws shown yesterday on NDTV... Pls forward this
msg urgently to people you care... Take Care!!
Share it as much as u can.
friends care full


Urgent forward
NOTE:
Important msg from Hyderabad police to all over
India:
For the next few weeks do not drink any product
of Maaza, as a worker from the company has
added his blood contaminated with HIV (AIDS). It
ws shown yesterday on NDTV... Pls forward this
msg urgently to people you care... Take Care!!
Share it as much as u can.
friends care full

Wednesday, April 29, 2015

మన పావన గోదావరి

                                                       మన పావన గోదావరి 

గోముఖాన పుట్టి'నదే' మన పావన గోదావరి

గలగలమని పారు'నదే' మన పావన గోదావరి!!


హైలెస్సల హుషారుతో మెలికలెన్నొ తిరుగుతుంది

జలగీతల సాగు'నదే' మన పావన గోదావరి!!

పాయలుగా విడిపోతూ మరల ఏక వాహినౌను

జలమార్గములేయు'నదే' మన పావన గోదావరి!!

వేకువలో రవి కాంతులు మేనంతా పూసుకుంది

బిడియాలను జార్చు'నదే' మన పావన గోదావరి!!

చందమామ దూకుతాడు ఈదులాటలాడేందుకు 

అలలకొంగు దాచు'నదే' మన పావన గోదావరి!!

సరసమైన సాగరాన్ని కలవాలని నెలరాజా

వడివడిగా కదులు'నదే' మన పావన గోదావరి!!!

ఈరోజు....వైశాఖ శుద్ధ ఏకాదశి.... అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారికల్యాణోత్సవం!!!

                      ఈరోజు....వైశాఖ శుద్ధ ఏకాదశి....
            అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి                                        వారికల్యాణోత్సవం!!!

                  శ్రీ సత్యనారాయణ స్వామివారు, అనంత లక్ష్మీ సత్యవతి అమ్మవారితో కలసి కొలువు తీరిన ప్రదేశం.పిలిస్తే పలికే దైవంగా పేరుపొందిన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని రత్నగిరి అనే కొండపై అన్నవరంలో నిర్మించారు. అన్నవరం ఒక సుప్రసిద్ద పుణ్యక్షేత్రం. శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దివ్యక్షేత్రం. కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.ఇక్కడ సామూహికంగా వందలాది దంపతులు కూర్చుని ఒకేసారి సత్యనారాయణస్వామి వ్రతాన్ని కనుల పండుగ గా చేసికొంటూ ఉండటం ఒక ప్రత్యేకత.అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది. ''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప'' అంటూ రాసిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారుఅన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు. 

                             ఈరోజు అన్నవరంలోనే కాక పేరూరు శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణం, అత్తిలి, అన్నవరప్పాడు , శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం కుడా అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి..

Tuesday, April 28, 2015

'పరోపకారార్ధం ఇదం శరీరం' మండే ఎండవేళ కాసిని నీళ్ళు దప్పిక తీర్చగలిగితే...నీళ్ళ దాతా సుఖీభవ!!

'పరోపకారార్ధం ఇదం శరీరం' అంటే ఇదే...మనం ఎన్నో ప్రవచనాలు ధర్మపన్నాలు వింటాం, చెప్తాం ధర్మసందేహాలు అడుగుతాం... తీరుస్తాం... చలివేంద్రాలు పెట్టాలనుకుంటాం ఆ వెంటనే అబ్బో డబ్బు ఖర్చు శ్రమ అని విరమిస్తాం...ఇదిగో చూడండి మనసుంటే మార్గముంటుంది...ఇలా... మండే ఎండవేళ కాసిని నీళ్ళు దప్పిక తీర్చగలిగితే...నీళ్ళ దాతా సుఖీభవ!! ఒక గిన్నెలో కాసిని నీళ్ళు ఇంటి బయట పెడితే మూగ జీవాలకు దాహం తీరుతుంది...మరి మనమూ చేద్దామా...సత్యసాయి-విస్సా ఫౌండేషన్.

Monday, April 27, 2015

మంచిమాట!!

మంచిమాట!!

ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది  ఏదైనా ఉంది అంటే 
అది గౌరవం మాత్రమే!! దానిని సంపాదించుకోవాలి  తప్ప 
పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో  కొనుక్కోలేము!!!


శ్లో!! లాలయేత్ పంచవర్షాణి - దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేత షోడశవర్షాణి - పుత్రమ్ మిత్రవదాచరేత్!!

శ్లో!! లాలయేత్ పంచవర్షాణి - దశవర్షాణి తాడయేత్
      ప్రాప్తేత షోడశవర్షాణి - పుత్రమ్ మిత్రవదాచరేత్!!

భావం :-       తల్లితండ్రులు పిల్లలను 5 సంవత్సరాల ప్రాయం వరకు లాలించాలి. తదుపరి 10 సంవత్సరాల వరకు అవసరమైతే దండిమ్చవచ్చును కూడా. కానీ 16 సంవత్సరాల నుండి పిల్లలతో తల్లితండ్రులు మిత్రులవలె మెలగాలి.

Sunday, April 26, 2015

మంచిమాట!!

మంచిమాట!!
రోజా చెట్టుకు ముల్లున్నాయని ఫిర్యాదు చెయ్యకుండా 
ముళ్ళ చెట్టుకు రోజాలు పూస్తున్నందుకు ఆనందించండి!!!!


జీర్ణము...జీర్ణము వాతాపి జీర్ణము అని ఎందుకు అంటారు?

                       జీర్ణము...జీర్ణము వాతాపి జీర్ణము  అని ఎందుకు అంటారు?

                             దండకారణ్యంలో ఇల్వలుడు, వాతాపి  అనే రాక్షస సోదరులు ఉండేవారు. వారిరువురూ అరణ్యం లోకి వచ్చే పోయేవారిని మాయమాటలతో పిలుచుకు వచ్చి వాతాపి మేకలా మారిపోతాడు. ఇల్వలుడు మేకను కోసి వండి వడ్డిస్తాడు. భోక్త తిన్నతరవాత ఇల్వలుడు వాతాపి బయటకురా అని పిలిస్తే వాతాపి భోక్త కడుపు చీల్చుకుని బయటకి వస్తాడు. అప్పుడు వారిద్దరూ కలసి ఆ భోక్తను భుజిస్తారు.

                           అగస్త్యుడికి ఈ విషయం తెలిసి భోక్తలా వెడతాడు. ఎప్పటిలానే ఇల్వలుడు వాతాపిని వండి వడ్డిస్తాడు. అగస్త్యుడు భుజించిన తర్వాత " వాతాపి బయటకిరా " అంటాడు. అప్పుడు అగస్త్యుడు ఇంకెక్కడి వాతాపి ....ఎప్పుడో  జీర్ణమయిపోయాడు. " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము " అంటూ పొట్టను రుద్దుకుంటాడు. ఆ విధంగా అగస్త్యుడు వాతాపిని జీర్ణం చేసుకుని ఇల్వలుడ్ని బూడిద చేస్తాడు. 

                                     ఎంత చెడుప్రభావం కలదైనా, అరగానిది అయినా  " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము "  అంటే అరుగుతుంది. అందుకనే ప్రతి తల్లి  పిల్లలకి భోజనం పెట్టి పూర్తయిన తర్వాత పిల్లల   పొట్ట మీద చేత్తో రాస్తూ  " జీర్ణము ,జీర్ణము వాతాపి జీర్ణము, ఏనుగు తిన్న వెలగకాయలు జీర్ణము, గుర్రం తిన్న గుగ్గిళ్ళు జీర్ణం,  మాబాబు ( మా పాప) తిన్న అన్నం జీర్ణం అని అంటూ వుంటుంది. 

శివాభిషేకం వాటి ఫలితాలు...... శివదర్శనం .....సర్వపాపహరణం !!!!!

                                                     శివాభిషేకం  వాటి ఫలితాలు.

తులసి తీర్ధం - మనశ్శాంతి 
పాలు    -    దీర్ఘాయువు 
పెరుగు   -    వంశాభివృద్ధి
చక్కర    -    శత్రుజయం 
తేనె       -    విద్య,సంగీత వృద్ధి 
నెయ్యి    -    స్వర్ణార్హత
పన్నెరు  -    సకల ఐశ్వర్యప్రాప్తి 
చందనం  -   ధనాభివృద్ధి
విభూది   -   సర్వరోగ నివారిణి 
నిమ్మరసం -  మరణ భయం హరం
పంచామృతాలు  -    దేహధారుడ్యం
పువ్వులు   -   సుఖం 
అరటిపళ్ళు  -   వ్యవసాయం 
అన్నం       -  పెండ్లి, సౌభాగ్యం 
పంచలోహ జలం  -   మంత్రసిద్ధి 
కస్తూరి    -   కార్యసాఫల్యం
దానిమ్మరసం  -   శత్రువశీకరణ 
సుగంధ ద్రవ్యములు  -  ఆయుర్దాయం 
మానవులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి భగవంతుని నవవిదాలుగా, స్మరణ ద్వారా.. అభిషేకం ద్వారా కొలుస్తారు.                                            
                                         శివదర్శనం .....సర్వపాపహరణం !!!!!

Saturday, April 25, 2015

కరివేపాకు ఉపయోగాలు.!

కరివేపాకు ఉపయోగాలు.!

'కూరలో కరివేపాకులా' తీసేస్తున్నారని సామెత వాడుకుంటారు. కాని కరివేపాకు  లేని తాలింపు ఒక్కసారి ఊహించుకోండి. కరివేపాకు వేయకుండా ఉప్మాగాని, పులిహోరగాని మీరు తినగలరా. కరివేపాకు వలనే మన  వంటకాలకు రుచి, సువాసన.   కరివేపాకుని...  తినకుండా పక్కన పడేస్తేమీరెన్నో పోషకాలను వదులుకోవల్సి వస్తుంది తెలుసా. కూరకు రుచినే కాదు ఇంకా ఎన్నో విధాలుగా  మీకు ఉపయోగపడుతుంది. అవేంటో  చెబుతాను వింటారా...

1.కరివేపాకు కొబ్బరినూనెలో మరిగించి, వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి .

2.కరివేపాకు, వేప కలిపి ముద్దగా నూరి ఒక స్పూను ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి పరగడుపున తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.

3.బ్లడ్‌షుగర్‌ ఉన్నవారు ప్రతిరోజూ కరివేపాకు  విరివిగా వాడటం వల్ల ఆ వ్యాధి అదుపులోకి వస్తుంది..

4.  కరివేపాకు మెత్తగా నూరి నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే మచ్చలు పడకుండా త్వరగా మానుతా
యి.

5. ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకుతో పాటుగా పసుపు సమానంగా తీసుకుని పొడి చేసుకొని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.

6. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి..

7.నీళ్లవిరేచనాలతో బాధపడేవారు కరివేపాకు  ముద్దగా చేసి ఒకటి రెండు స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగలో కలిపి రోజుకు మూడు నాలుగు సార్లు సేవిస్తే వెంటనే తగ్గుతాయి..

8..
మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్‌ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూంటే ఆ సమస్యల నుంచి బయటపడవచ్చు.





శనిగ్రహ దోష పరిహారాలు

శనిగ్రహ దోష పరిహారాలు
శని అంటే నవగ్రహాలలో ఒక అతి ముఖ్య గ్రహం.జాతకంలో శని సంబంధిత నక్షత్రాలు ‘పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. ప్రతివారి జాతకంలో ఈ ఏల్నాటి శని, అర్ధాష్టమ, అష్టమ శనులు వస్తూ వుంటాయి. వాటి ప్రభావాన్ని చూపిస్తువుంటాయి.వారి కర్మానుసారం (వారి వారి జన్మలగ్నాలను బట్టి) ప్రతి వ్యక్తి ఎం తో కొంత శని వలన బాధలు పొందుతారు. అయితే పరిహారాలు సక్రమంగా చేసుకొని, క్రమ శిక్షణాయుతమైన జీవనం గడిపి, ‘శని’’గాడు అని ఎవర్నీ దూషించకుండా వుంటే చాలా వరకు ఇబ్బందులు అధిగమించవచ్చు.
మనిషికి అనుకోని చిక్కులు, ఇబ్బందులు, టెన్షన్స్‌ అన్నీ కూడా శని వల్ల జరుగుతా యి. మనసులలో జోక్యం, అనారోగ్యా లు, చేద్దామనుకున పనులన్నీ వాయిదాలు, మానసి క శాంతి అన్నీ శని దేవుని ఘనతే అని చెప్పాలి. ప్రతి చోట ప్రతి వారితో ఏదో రూపంలో మోసపోవటం, నష్టపోవటం, మానసిక ఘర్షణ అన్నిటికీ సూత్రధారి. ఏలినాటి శనిలో ముఖ్యంగా జన్మ శని, వ్యయ శని, ద్వితీయ శనిలో దాదాపుగా 2 1/2 సం చొప్పున 7 1/2 సం శని వుండటం వలన ఖర్చులు, చిక్కులు, అవమానాలు, బంధుమిత్రులతో విద్వేషాలు, ‘నా’ అన్న వారితో వైరాలు, మంచికెడితే చెడు ఎదురవ్వటం, అప్పులు, హాస్పిటల్‌ దర్శనాలు ఇలా అనేకరకమైన ఇ్బందులు.
అర్ధాష్టమ, అష్టమ శనులు నడి చేటపుడు కార్యాల యందు అసంతృప్తి, మోకాలు, స్పాండిలైటిస్‌, నరాలు మొదలైన ఇబ్బందులు (దంతరోగాలు కూడా), ఇష్టం లేని ప్రదేశాలకి వృత్తిపరమైన మార్పులు, వైరాగ్యం, అనుకోని పరిచయాల వల్ల వూహించని పరిణామాలు, మనసు అంతా వెలితి... ఏదో పోగొట్టుకు న్న భావన. అంతా వున్నా... అందరి మధ్యవున్న, మంచి హోదా ఉన్నా తెలీని ఆందోళన, అసంతృప్తి, వేదన.మరి ఆ శనిని సంతృప్తి పరచటానికి రెమిడీలు అవసరం.
శని వల్ల ‘నీలం’ ధరిస్తే ఇబ్బందులు అధిగమించవచ్చు అనుకోవటం సరి కాదు.పూ ర్తి జాతకం చూపించుకున్నాక, అవసరమైతే తప్పక ధరించాలి.
శని శ్రమ కారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చెయ్యాలి.సాద్యమైనంతవరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మంచిది.
శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వులనూనె వ్రాసుకొని కొంత సమయం తరువాత వేడి నీటితో స్నానం చెయ్యాలి.
తడికాళ్ళతో నిద్రించరాదు.పరిసరాలను పరిశుబ్రంగా ఉంచుకోవాలి.ముఖ్యంగా పూజ గది,బెడ్రూం,పరిశుబ్రంగా ఉండాలి.సుఖవంతమైన నిద్ర కోసం బెడ్రూంలో నీలం బల్బు బెడ్ లైట్ వేసుకోవాలి.
శ్రమ జీవులు అయిన చీమలకు తేనే గాని చెక్కెర గాని వెయ్యాలి.ఆవుకి బెల్లంతో కలిపిన నువ్వులను తినిపియ్యాలి.నల్ల కుక్కలకి,కాకులకి ఆహారం వెయ్యాలి.
ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చెయ్యాలి.మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం,వదలటం చేస్తే వాయు కారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలివాళ్ళకి,మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చెయ్యాలి. సేవకులను అకారణంగా దూషించకూడదు.
శని స్తోత్రం, శని చాలిసా, శని అష్టాత్తర, సహస్రనామ స్తోత్రం పారాయణ చాలా మేలు.అమావాస్య రోజున కాళీ స్తోత్రం చదువుకోవాలి.ఇనుముతో చేసిన శివలింగాన్ని గాని,కాళికాదేవిని గాని పూజించాలి. ఏడమచేతి మద్యవేలికి గుర్రపు నాడా రింగ్ దరించాలి.అయ్యప్ప దీక్ష దారణ చెయ్యటంగాని,అయ్యప్ప భక్తులకు బోజనం పెట్టటంగాని చెయ్యాలి.
నల్లపసుపుని పొడి చేసి విబూతితో గాని గంధంతో గాని నుదుట ధరించాలి.కాళ్ళు విపరీతంగా నొప్పులు వున్నవారు నల్లపసుపు పొడిని బొగ్గుపొడిలో కలిపి అరికాళ్ళకు పట్టిస్తే ఉపశమనం కలుగుతుంది.

శ్రీ సూర్యనారయణమూర్తి.

సర్వజీవరాశులకు ఆరోగ్యప్రధాత, సమస్త భూమండలానికి వెలుగును

 ప్రసాదించే స్వామి, జీవకోటికి ఆయుష్షును పెంచే స్వామి....

శ్రీ సూర్యనారయణమూర్తి.



పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దివ్య క్షేత్రం మంగళగిరి.

                                                              పానకాల లక్ష్మీ నరసింహ స్వామి
మన రాష్ట్రంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం మంగళగిరి. గుంటూరు జిల్లాలో ఉన్న ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారుగా పూజలందుకుంటున్నారు.
మంగళం పుండరీకాక్షో మంగళం గరుడధ్వజ!
మంగళాద్రి నివాసాయ తుంగమంగళదాయినే!
రాజ్యలక్ష్మీ సమేతాయ శ్రీ నృసింహాయ మంగళం!
రత్న సింహాసనస్థాయ రమాలింగితవక్షసే!
రమేశాయ సురేశాయ శ్రీ నృసింహాయ మంగళం!

అంటూ శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారి నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం మంగళగిరి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు కొలువైన దివ్యధామంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు తపస్సు చేసిన పవిత్ర క్షేత్రంగా విరాజిల్లుతున్న ఈ దివ్య క్షేత్రం నృసింహ దేవునికి అత్యంత ప్రియమైన ధామంగా విరాజిల్లుతోంది.
మంగళగిరిని కోటాద్రి అని, స్తుతాద్రి అని, మంగళాద్రి అని కూడా పిలవడం జరుగుతోంది. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లీలా విశేషాలకు వేదికలా ఉన్న ఈ దివ్య క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలకు కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది.
పురకుత్సుడనే మహారాజు ఇక్కడ స్వామివారిని సేవించి అనేక గోదాన, భూదాన, సువర్ణ దానాలిచ్చినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అలాగే రఘువంశజుడైన శంఖ భూపాలుడు, యయాతి మహారాజు; చంద్ర వంశజుడైన ఇంద్రద్యుమ్నుడు ఇక్కడ స్వామిని సేవించి మాన్యాలు ఇచ్చినట్లు ప్రతీతి. సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు మంగళాద్రిపై తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్రానికి మంగళాద్రి అని పేరు వచ్చినట్లు చెప్తారు. ఇక్కడ స్వామివారు కొలువైన పర్వతాన్ని ముక్తి పర్వతం అని పిలుస్తారు. ఉగ్రనరసింహ స్వామి వారు ఇక్కడ కొలువై ఈ క్షేత్రానికి వచ్చే భక్తులకు ముక్తిని ప్రసాదిస్తారని భక్తుల విశ్వాసం. ఆకారణంగా ఈ పర్వతం ముక్తి పర్వతంగా విరాజిల్లుతోంది. శ్రీస్వామి వారు కొలువైన ఎగువ, దిగువ ఆలయాలకు 16వ శతాబ్దంలో శ్రీ కృష్ణ దేవరాయలు ముఖ మండపాలు కట్టించినట్లు చారిత్రిక ఆధారాలద్వారా తెలుస్తోంది. క్రీశ. 1550వ సంవత్సరంలో విజయనగర రాజైన సిద్దిరాజు రాజయ్య దేవర స్వామివారికి 28గ్రామాలతో 150 కుచ్చళ్ల భూమిని ధర్మంగా ఇచ్చినట్లు, అలాగే 1807-09 సం.ల మధ్య కాలంలో రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు కొండ దిగువన తూర్పు గాలిగోపురాన్ని నిర్మించినట్లు చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
భక్తులు ముందుగా అతిపురాతనమైన ఈ మెట్ల మార్గంలో శ్రీ రామకృష్ణ మఠాన్ని భక్తులు దర్శించుకుంటారు. ఈ మఠంలో ఉన్న శ్రీకృష్ణ పాదుకల దర్శన భాగ్యం చేతనే ఆ జగన్మోహనుడి సాక్షాత్కారం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. స్వామి దర్శనం అనంతరం మెట్ల మీదుగా కొండ పై భాగానికి చేరుకుంటారు. మనోహరమైన ప్రకృతి దృశ్యాలకు వేదికలా ఉన్న శ్రీ పానకాల నరసింహ స్వామి వారి ఆలయం ముక్తి పర్వతం మీద దర్శనం ఇస్తుంది. హ్రస్వ శృంగి అనే భక్తుని అనుగ్రహించడానికి స్వామివారు అతని ఏనుగు ఆకారంలో గల ఈ పర్వతం మీద కొలువై ఉన్నట్లు పురాణాల ద్వారా అవగతమౌతోంది.

మంగళాద్రి క్షేత్రాన్ని క్రీ.శ.8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు దర్శించినట్లు 1512లో శ్రీ కృష్ణ చైతన్య ప్రభువులు స్వామిని దర్శించి తరించారని పురాణాల ద్వారా అవగతమౌతోంది. కొండ మీదకు చేరుకున్న భక్తులు స్వామివారికి పానకాన్ని సమర్పించడానికి వరుసలో నిలబడతారు.
ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉండడానికి ఒక పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో నముచి అనే రాక్షసుడు బ్రహ్మచేత వరం పొంది ఇంద్రాది దేవతలను విపరీతంగా వేధించేవాడట. అతని బాధలకు తాళలేని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు కోరగా స్వామి ఉగ్రనరసింహావతారంలో నముచి ని సంహరించాడట. స్వామి ఉగ్రరూపం చూసి వణికి పోయిన ఇంద్రాది దేవతలు స్వామికి పానకం సమర్పించి స్తుతించారట. ఆ కారణంగానే స్వామివారికి ఇక్కడ పానకం పోస్తారని పురాణాల ద్వారా అవగతమౌతోంది. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని స్వామికి భక్తి శ్రద్ధలతో పానకాన్ని సమర్పించుకుంటారు. వరుసలో నిలబడిన భక్తులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినే నమః అంటూ గర్భాలయానికి ముందు భాగంలో ఉన్న అంతరాలయానికి చేరుకుంటారు. అతిపురాతనమైన ఈ అంతరాలయంలో ఉన్న స్తంభాలు, ప్రాకారాలు అలనాటి కట్టడాలను స్ఫురింపజేస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయంలో స్వామి వారికి ఎదురుగా ఆంజనేయుడు దర్శనమిచ్చి ఈ ఆలయానికి వచ్చే భక్తుల అభీష్టాలను నెరవేరుస్తాడంటారు. వాయు పుత్రుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన ఉగ్రనరసింహ స్వామి దర్శనం చేసుకొని “తండ్రీ! ఉగ్రనరసింహా! మేమిచ్చే ఈ పానకాన్ని స్వీకరించి మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించు తండ్రీ “ అంటూ ప్రణమిల్లుతూ తమతో తెచ్చిన పానకాన్ని స్వామివారి నోట్లో పోస్తారు.
ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు. భక్తులు అనంతరం ఇక్కడే ఉన్న రాజ్యలక్ష్మీ అమ్మవారిని, ఇతర దేవీ దేవతలను కూడా భక్తితో దర్శించుకుంటారు. అనంతరం భక్తులు కొండపై భాగంలో ఉన్న రాజ్యలక్ష్మీ అమ్మవారిని చేరుకొని గర్భాలయంలో కొలువై ఉన్న అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. అనంతరం వల్లభాచార్యుల వారి మఠాన్ని, శ్రీ రంగనాయక స్వామి వారిని, భక్తితో దర్శించుకుంటారు. రాజ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి సమీపంలో ఆంజనేయ స్వామి వారి మూర్తి ఒకటి దర్శనమిస్తుంది.

మంగళగిరిలో పూర్వం కళ్యాణ పుష్కరిణి కూడా ఉండేదిట. ప్రస్తుతం అది శిథిలమయింది. అలాగే 1594లో గోల్కొండ సుల్తాన్ సేనాపతియైన కుతుబ్ అలీ స్వామి వారిని దర్శించినట్లు తెలుస్తోంది. అనంతరం భక్తులు దిగువ సన్నిధిలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుంటారు. దిగువ సన్నిధిలో ఉన్న తూర్పు గాలిగోపురం 153అడుగుల ఎత్తులో ఉండి దేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయంలోకి చేరుకున్న భక్తులకు స్వామి వారికి ఎదురుగా గరుడాళ్వార్ దర్శనమిస్తారు. గర్భాలయానికి ముందు జయవిజయుల శిలా విగ్రహాలకు నమస్కరించి భక్తులు గర్భాలయంలోకి చేరుకుంటారు. లక్ష్మీ నరసింహ స్వామి నామ స్మరణతో మారుమ్రోగే గర్భాలయంలో ఒక ప్రక్క ఆళ్వారుల సన్నిధి మరొక ప్రక్క శయన మందిరాలు దర్శనమిస్తాయి. స్వామివారి గర్భాలయానికి ముందు ఉత్సవ మూర్తులు దర్శనమిస్తారు. పండుగలు, శుభకార్యాలప్పుడు ఈ ఉత్సవ మూర్తులే పల్లకి మీద ఊరేగుతారు. ప్రసిద్ధ హిందూ ప్రవక్త వల్లభాచార్యుల వారు మంగళాద్రికి నైరుతి భాగాన ఉన్న వట తీర్థమందు తపస్సు చేసి స్వామివారి ఆజ్ఞానుసారం హైందవ సముద్ధర సిద్ధాంతాన్ని ఇక్కడి నుంచే యావత్ భారత దేశానికీ వ్యాప్తి చేశారని ప్రతీతి.

పెళ్ళికాని అబ్బాయిలు త్వరగా పెళ్లి కావాలంటే ఈ స్తోత్రం చదవండి.

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ, కాత్యాయనీ వ్రతమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా ?అలా వెతకగా వెతకగా చివరికి సమాధానం గా నాకు దొరికిన విషయం . క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము ఆలస్యమవుతున్న అబ్బాయిలకి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి కాదు.
సర్వదేవ కృతమ్ శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్||
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||
|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

Friday, April 24, 2015

ఆరోగ్యమే మహా భాగ్యం. వేసవి లో సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము

                                                  వేసవి లో సహజ పోషకాల పానీయాలు సేవిద్దాము
వేసవి రాగానే చల్లని పానీయాల వైపు మనసు
మళ్ళుతుంది. శీతల పానీయాలు ఆరోగ్యానికి హాని
కలిగిస్తాయి. ఈ క్రింది సహజ పోషకాలు 
పానీయాలను సేవిద్దాము.
1) కొబ్బరినీరు: ఇందులో 5 కీలక electrolights (ఎలెక్ట్రోలైట్స్)
పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం, కాల్షియం
లను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచును.
2) మజ్జిగ: దీనిలోని ల్యాక్టోబాసిల్లస్ అనే మిత్ర
కారక బ్యాక్టీరియా వలన వ్యాధి నిరోధక శక్తి
పెరుగును. ఇందులోని ల్యాక్టి కామ్లం పదార్థాలను
త్వరగా జీర్ణం చేయును. ఇందులో
పొటాషియం, క్యాల్షియం, రైబోఫెవిన్ ,విటమిన్ B-12
లభిస్తాయి.
3) సబ్జా నీరు: మహిళలకు అవసరమయ్యె పాలేట్,
నియాసిన్, చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్ E
అధికంగా కలిగి ఉండటం వలన శరీరంలో పేరుకున్న
వ్యర్థాలను తొలగించి రక్తాన్ని శుద్ది
చేస్తుంది. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
4) పుచ్చకాయ : గుండె జబ్బులు రాకుండా చేసే
పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ A
ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే LYKOPIN (లైకోపినన)
సూర్యరశ్మి లోని U.V కిరణాల నుండి చర్మాన్ని
రక్షిస్తుంది.
5) తాటి ముంజలు : 6 అరటి పండ్లలో ఉండే పొటాషియం
ఒక్క తాటి ముంజలో ఉంటుంది బి.పి ని అదుపులో
ఉంచి కోలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎముకలను
బలంగా ఉంచుతుంది. వ్యాధి నిరోధక శక్తిని
పెంచుతుంది.
6) నిమ్మ రసం: సిట్రిక్ ఆసిడ్ మూత్ర పిండాలలోని
రాళ్ళను కరగదీస్తుంది. విటమిన్ సి ఎక్కువ
7) చెరుకు రసం: ఇందులో ఐరన్ ,ఫాస్పరస్ ,
క్యాల్షియం , మెగ్నీషియం పొటాషియం
మూలకాలుంటాయి. ఇవి రొమ్ము , ప్రోస్టేట్ క్యాన్సర్
కారకాలతో పోరాడుతాయి. మూత్ర పిండాలు
గుండె, మెదడుల పనితీరుని మెరుగు పరుస్తాయి
.
8) రాగి జావ: ఇది మధుమేహం, కీళ్ల నొప్పుల,
acidity (ఎసిడిటి) ని తగ్గిస్తుంది
మనకి అందుబాటులో వుండే వీటినన్నిటిని సేవించి చక్కని ఆరోగ్యాన్ని
 పొందుదాము. 
                                                     ఆరోగ్యమే మహా భాగ్యం.

" శ్రీ సూర్యనారాయణ మేలుకో

కవితాత్మకమైన భావాలు జీవితంలో మనం ఇంకా దర్శించని కొన్ని కొన్ని లోతులని మనకి చూపే ప్రయత్నం చేస్తూ ఉంటాయి.
మామూలుగా చూస్తే ఇదే సూర్యుడు.
రోజూ ఉదయిస్తూ ఉంటాడు,మధ్యాహ్నం విపరీతమైన వేడిని వెదజల్లుతూ "వెధవ ఎండ,భరించలేకపోతున్నాం " అని మనం అనుకునేలా ప్రవర్తిస్తూ ఉంటాడు,మళ్ళీ సాయంత్రం పూట ఏదో పనిఉన్నవాడిలా అస్తమిస్తూ పోతూ ఉంటాడు.ఈ సూర్యోదయ,సూర్యాస్తమయ కాలాల మధ్యలో సూర్యుని తాలూకు సౌందర్యాన్ని ఎప్పుడైనా దర్శించామా?
అన్నమాచార్యులు ఎంత బాగా మనకా సౌందర్యాన్ని దర్శింప చేస్తున్నడోచూడండి ఈకీర్తనలో...
" శ్రీ సూర్యనారాయణ మేలుకో హరి సూర్యనారాయణ
పొడుస్తూ భానుడూ పొన్న పువ్వు ఛాయ
పొన్నపువ్వు మీద పొగడపువ్వు ఛాయ
ఉదయిస్తూ భానుడు ఉల్లిపువ్వు ఛాయ
ఉల్లిపువ్వుమీద ఉగ్రంపు పొడిఛాయ
గడియెక్కి భానుడు కంబపువ్వు ఛాయ
కంబపువ్వు మీద కాకారీ పూఛాయ
జామెక్కి భానుడు జాజిపువ్వు ఛాయ
జాజిపువ్వుమీద సంపంగీ పూఛాయ
మధ్యాహ్న భానుడు మల్లెపువ్వు ఛాయ
మల్లెపువ్వుమీద మంకెన్న పూఛాయ
మూడుఝాముల భానుడు ములగపువ్వు ఛాయ
ములగపువ్వుమీద ముత్యంపు పొడిఛాయ
అస్తమాన భానుడు ఆవపువ్వు ఛాయ
ఆవపువ్వుమీద అద్దంపు పొడిఛాయ
వాలుతూ భానుడు వంగపువ్వు ఛాయ
వంగపువ్వుమీద వజ్రంపు పొడిఛాయ
గుంకుతూ భానుడు గుమ్మడిపూఛాయ
గుమ్మడిపువ్వుమీద కుంకంపు పొడిఛాయ "

అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?

                               అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పదా ?    

                  సాధారణంగా అన్నిదానాలలోకి అన్నదానము గొప్పది అంటారు. కానీ  మనువు అన్నీ దానాలలోకి విద్యాదానము  మహోన్నతమైన ఫలమని తెలియ చెప్పాడు. నీరు, అన్నము, గోవులు, భూమి, వస్త్రములు, బంగారము, దినసరి భత్యములు .... వీటి అన్నింటికన్నా  విద్యాదానము గొప్పది. ఎందుకంటె వస్తువులు, ధనము లాంటివి దానంగా ఇస్తే వారికే ఉపయోగపడతాయి. అదే విద్యాదానం చేస్తే వారికీ, వారి కుటుంబ మంతటికి ఉపయోగ పడుతుంది అని మనువు తెలియచేసాడు.

మంచిమాట!!!

                                                               మంచిమాట!!!
పొగడ్తల కంటే సద్విమర్శలు మనిషికి ఎప్పుడూ మేలు చేస్తాయి,
ఉపయోగపడతాయి.మంచి జ్ఞాపకశక్తి మంచిదే, 
కాని ఇతరులు మీకు కలిగించిన హానిని 
మరచిపోయే సామర్ధ్యం అన్నదే 
గొప్పతనపు పరీక్ష అవుతుంది.


తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

తిరుపతిలో శ్రీవెంకటేశ్వరస్వామికి పద్మావతీ అమ్మవారు కుడిప్రక్కన, 
శ్రీ లక్ష్మీదేవి ఎడమ ప్రక్కన ఎందుకు ఉంటారు?

                                           తిరుమలపై శ్రీమహావిష్ణువు  మనుష్య రూపము దాల్చడము, ఆ తరువాత ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహం చేసుకోవడము అందరికీ తెలిసిందే. శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిల వివాహం గురించి సరిగ్గా లక్ష్మీదేవికి నారదుడు చెబుతాడు. దానితో లక్ష్మీదేవి  శ్రీవేంకటేశ్వరస్వామి , పద్మావతి దేవిలతోను  గొడవకు దిగుతుంది. ఆ సమయంలో శ్రీనివాసుడు పద్మావతి  పూర్వగాధ శ్రీలక్ష్మీదేవికి చెప్పి, కుడి వక్షస్థలముపై పద్మావతిని, శ్రీలక్ష్మీదేవిని ఎడమ వక్షస్థలం పైన ఉండమని కోరుతాడు. భర్త ఆదేశానుసారంగా ఇద్దరు అమ్మవార్లు స్వామికి ఇరువైపులా ఉంటారని పెద్దలు చెపుతారు.


ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80

AP Residential Junior College, Vijayapuri South, Nagarjuna Sagar is going to celebrate Ruby Jubilee on 31st and and 1st at Sagar. On this occasion, a memoir:
ఆంధ్ర ప్రదేశ్ గురుకుల జూనియర్ కళాశాలలో నేను ఇంటర్మీడియెట్ 1978-80 లో చదువుకున్నాను. ఆ కళాశాల నా జీవితాన్ని ఊహించని విధంగా మలుపుతిప్పింది.
నేను 1972 నుంచి 78 దాకా తాడికొండ గురుకుల పాఠశాలలో చదువుకున్నాను. తాడికొండ పాఠశాలలో నేను మొదటి బాచ్ స్టూడెంటుని. 78 లో పదవతరగతిలో నాకు రాష్ట్రంలో పదవరాంకు వచ్చింది. అప్పట్లో మొదటి పదిరాంకులు తెచ్చుకున్నవాళ్ళకి సాగర్ కి ఎంట్రన్సు టెస్టు రాయనక్కర్లేకుండానే ప్రవేశం దొరికేది. పైగా కోరుకున్న బ్రాంచిలో కూడా సీటు దొరికేది. ఆ రోజుల్లో రాంకులు తెచ్చుకున్న విద్యార్థులంతా అయితే ఎం.పి.సి నో లేదా బి.పి.సి నో తీసుకునేవాళ్ళు. కాని నేను సి.యి.సి తీసుకున్నాను. ఆ రోజుల్లో అదొక పెద్ద సంచలనం. నేను సి.యి.సి కోరుకుంటున్నాని ఎలా తెలిసిందో గాని, నేను కాలేజికి వెళ్ళేటప్పటికే ఒక సెలబ్రిటిగా మారిపోయాను. కొన్నాళ్ళ పాటు ప్రతి ఒక్కరికీ నన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉండేది.
మొదటిసంవత్సరంలో సాగర్ నాలో మానసికంగా చాలా కలవరం కలిగించింది. ఆ కలవరానికి చాలానే కారణాలున్నాయి.
మొదటిది, తాడికొండలో ఉన్నప్పుడు మేమంతా తీరప్రాంత జిల్లాలకు చెందినవాళ్ళం కావడంతో అదంతా ఒక పరిమిత ప్రపంచంకిందనే లెక్క. కాని సాగర్ లో మొదటిసారి మేం రాష్ట్రం నలుమూలలనుంచీ వచ్చిన విద్యార్థుల్ని చూడవలసివచ్చింది. ముఖ్యంగా హైదరాబాదులో రకరకాల ఇంగ్లీషు మీడియం స్కూళ్ళల్లో చదువుకుని వచ్చిన విద్యార్థుల్ని చూడగానే చాలా బెరుగ్గానూ,సిగ్గుగానూ ఉండేది. వాళ్ళు ఇంగ్లీషు చాలా సహజంగా మాట్లాడేవాళ్ళు. మేం పదవతరగతి దాకా తెలుగుమీడియం లో చదువుకున్నాం. ఇంగ్లీషులో మాట్లాడటం అలవాటులేకపోగా, మా హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు ఇంగ్లీషులో మాట్లాడటం అపరాధమనే భావనకూడా మాలో కలిగించినందువల్ల మాకు, ముఖ్యంగా నాకు ఇంగ్లీషులో ఒక్క ముక్కకూడా నోరు తిరిగేది కాదు. పైగా ఇంగ్లీషు క్లాసు కామన్ గా ఉండటంతో అన్ని గ్రూపులవాళ్ళూ కలిసేవారు. వాళ్ళందరిమధ్య నోరుతెరవాలంటే చాలా సంకోచంగా ఉండేది. కాని మా ఇంగ్లీషు లెక్చెరర్ బి.ఎల్. నరసింహంగారు నేను రెండవ సంవత్సరం చివరిలో ఉండగా నేను ఇంగ్లీషులో బాగా పట్టు సాధించానని మెచ్చుకున్నారు. అది నా జీవితంలో నేను పొందిన గొప్ప ప్రశంసల్లో ఒకటి.
ఇక కలవరం కలిగించిన కారణాల్లో రెండవది, తాడికొండలో మాకూ, మా ఉపాధ్యాయులకీ మధ్య మానసికంగా ఎంతో గాడానుబంధం ఉండేది. మేం వాళ్ళను ప్రేమించేవాళ్ళం, మా తల్లిదండ్రులతో సమానంగా చూసుకునేవాళ్ళం. కాని సాగర్ జూనియర్ కళాశాల అయినందువల్ల,తాడికొండ స్థాయిలో మానసికానుబంధం బలపడలేదు. చాలాకాలం పాటు ఆ వెలితి అట్లానే ఉండేది. కాని ఆ శూన్యాన్ని పూరించిన మనిషి అప్పటి మా లోకోపేరెంట్ భద్రయ్యగారు. ఆయన మా ఇకనమిక్స్ లెక్చెరర్. నన్ను చాలా అభిమానించారు. నేను రెసిడెన్షియల్ పాటర్న్ నుంచి వచ్చిన విద్యార్థిననీ తక్కినవాళ్ళకి ఒక మోడల్ గా ఉండాలనీ అనేవారు. ఆ కళాశాలలో నేను రెండేళ్ళపాటు చదవగలిగానంటే అందుకు ఆయన చూపించిన వాత్స్లల్యమే కారణం.
మూడవదీ, బహుశా నా జీవితాన్ని సమూలంగా మార్చివేసిందీ ఒక విషయముంది. అదేమంటే నా మొదటిసంవత్సరం పరీక్షా ఫలితాలు రాగానే అందులో నాకు తెలుగులో 36, ఇకనమిక్స్ లో 36 మార్కులు రావడం. ఆ రెండు సబ్జెక్టులూ నాకెంతో ఇష్టమైనవి. అయినా నాకంత తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. భద్రయ్యగారు రీకౌంటింగ్ పెట్టిద్దామన్నారుగానీ ఎందుకు పెట్టించలేదో ఇప్పుడు గుర్తు రావడం లేదు.
కాని ఆ సంఘటనతో నాకు చదువుమీదనే ఆసక్తి పోయింది. ఏమైతేనేం, సివిల్ సర్వీసుకి వెళ్ళాలన్న ఉద్దేశ్యంతో సి.ఇ.సి తీసుకున్న నేను నా మొదటిసంవత్సరం ఫలితాల వల్ల మొత్తం కెరీర్ మీదనే దృష్టి వదిలేసాను. నా ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక నేను సిల్వర్ జూబిలీ కాలేజికి వెళ్ళకపోవడానికీ, ఎక్కడో నామమాత్రంగా బి.ఏ లో చేరడానికీ, ఆ తర్వాత ఆ చదువు కూడా మధ్యలో ఆపేసి టెలిపోన్స్ డిపార్ట్మెంట్ లోఉద్యోగంలో చేరిపోవడానికీ ఆ మొదటిసంవత్సరం అనుభవమే కారణం.
సాగర్ జీవితం నాలో కలిగించిన మరొక కలవరం, సాధారణంగా ఆ వయసు కలిగించే కలవరం. పదహారు, పదిహేడేళ్ళ అడాలసెంటు పిల్లవాడి మనసు చాలా లేతగా ఉంటుంది. ఎవరితోనైనా స్నేహం చెయ్యాలనిపిస్తుంది, ఎవరినైనా ప్రేమించాలనిపిస్తుంది. ప్రేమించినవాళ్ళకోసం ఏమైనా చెయ్యాలనిపిస్తుంది. తాడికొండ జీవితం నుంచి సాగర్ జీవితానికి వచ్చేటప్పటికి నాకు తెలీకుండానే నా మనసులో వికసించిన కొత్త కలవరాన్ని నేనొక పట్టాన అర్థం చేసుకోలేకపోయాను. ఆ కలవరంలో అక్కడ నా మొదటిసంవత్సరంలో నాకు తోడుగా ఒకరిద్దరు సీనియర్లు నిలబడకపోలేదు.
కాని ఆ కాలమంతటా నన్ను నిజంగా ఆదరించిందీ, అక్కునచేర్చుకున్నదీ సాహిత్యమేనని చెప్పాలి. రైట్ బాంకు బ్రాంచి లైబ్రరీలో అందుబాటులో ఉన్న తెలుగుసాహిత్యమంతా చదివినాప్పుడు. చలం, బుచ్చిబాబు, శరత్ ల కథలు, నవలలతో పాటు సంజీవదేవ్, ఆచంట జానకిరాం వంటివారి రచనలు కూడా నాకు తోడుగా నిలబడ్డాయి.
ముఖ్యంగా ఆ రోజుల్లో నాలో రేకెత్తిన ఎన్నో ప్రశ్నలు మా అక్కకి ఉత్తరాలు రాసేను. ఆమె ఎంతో ఓపిగ్గా, ప్రేమగా నాకు జవాబులు రాసేది. ఆమె రాసిన ఉత్తరాలే లేకపోయుంటే ఆ అయోమయంలో నేనెటుజారిపోయిఉండేవాణ్ణో నాకే తెలియదు.
బహుశా నా రెండవసంవత్సరమంతా నేను చదువు మీంచి దృష్టి సాహిత్యం మీదకు తిప్పిఉంటానని ఇప్పుడు అర్థమవుతున్నది. నా సాహిత్యజీవితానికి నిజమైన పునాదులు అప్పుడే పడ్డాయనుకుంటాను. నేను రెండవసంవత్సరంలో ఉండగానే ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన సంక్రాంతి కథలపోటీకి ఒక కథ రాసిపంపించాను. దానికి రాష్ట్రస్థాయిలో మొదటిబహుమతి వచ్చింది. ఆ కథ మా అన్నయ్య పేరుమీద ప్రచురితమయ్యింది. కాని ఆ సంఘటన నా జీవితాన్ని సమూలంగా మార్చేసింది. నా కర్తవ్యం సివిల్ సెర్వంట్ గా గడపడం కాదనీ, ఒక కవిని కావడమనీ,రచయితని కావడమనీ నాలోపల్లోపల నేను బలంగా నమ్మడం మొదలుపెట్టాను.
సాగర్ జీవితం నాలో కలిగించిన కలవరంతో పాటు నాకొక కొత్త జీవితానికి కూడా దారిచూపించిందని చెప్పాను కదా. ఆ జీవితం నాలో కలిగించిన కొత్త చైతన్యం గురించి కూడా రెండుమూడు మాటలు చెప్పాలి.
సాగర్ చుట్టూ ఉండే లాండ్ స్కేప్ లో ఏదో ఒక గంభీరసౌందర్యం కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అ రిజర్వాయర్. దూరంగా ఆనకట్ట, సాయంకాలం కాగానే ఆ జలాశయంలో ప్రతిఫలించే దీపాలవెలుతురు. తంగెడు పూలూ, పొద్దున్నే రిజర్వాయర్ మీచి వీచే శుభ్రపవనాలూ నాలో కవిని తట్టిలేపాయి. ఆ రోజులంతటా నేను డైరీలు రాయడం మొదలుపెట్టాను. ప్రతి రోజూ నాలో కలిగే భావాల్ని 'భావవీచిక 'పేరిట రాసుకుంటూ ఉండేవాణ్ణి. ఆ రాతలు నన్ను నాకు చాలా సన్నిహితుణ్ణి చేసాయి. తాడికొండలో నాకు లభించి సాగర్ లో శూన్యంగా మారిన చోటేదో దాన్ని నా భావాలతో నింపుకోవడం మొదలుపెట్టాను. ఆ క్రమంలో నాకు తెలియకుండానే నేనొక రొమాంటిసిస్టుగా మారడం మొదలుపెట్టాను.
జీవితానికి దూరంగా, కలలప్రపంచంలో మాత్రమే జీవించేవాడు రొమాంటిసిస్టు. అందుకే ఆ రోజుల్లో నాకు చాల ఇష్టమైన కవిత వేదుల రాసిన 'దీపావళినాడు '. 'దినములు పరస్పర ప్రతిధ్వనులుకాగ,ఇరువదైదేండ్లు నా బతుకిట్టె గడిచె, ఈ రహోదు:ఖ వీధులందు నేనెరుగ సఖుల అడుగుజాడలీసరికి కూడ ' ఎన్ని సార్లు చదివి ఉంటానీ వాక్యాన్ని!
ఆ రోజుల్లోనే ఒకసారి సెలవులనుంచి కాలేజీకి తిరిగివస్తూ గుంటూరు బస్ స్టాండ్లో 'అసమర్థుని జీవయాత్ర ' కొని చదివాను. ఆ పుస్తకం నన్ను పూర్తిగా నిశ్చేష్టుణ్ణి చేసింది.
కాని ఆ అగమ్యంలో మళ్ళా మా అక్క ఉత్తరాలే నాకు దారిచూపించాయి. ఆమె రాసిందికదా: కళ జీవితం కాదు, జీవితం కళగా మారాలని. గొప్ప కళాకారుడు తన శక్తినంతా కళగా మార్చుకుని తన జీవితాన్ని అశాంతితో నింపుకుంటాడనీ, అలాకాక తాను జీవించవలసిన రోజువారీజీవితాన్ని కూడా ఎంతో సౌందర్యవంతంగా జీవించగలగడమే నిజమైన కళ అనీ ఆమె రాసింది. అక్కడితో ఆగకుండా నాకు 'సౌందర్య ' అనే కలం పేరు కూడా పెట్టింది.
ఈ ప్రపంచంనుంచి దూరంగా పోవాలనే కలలొకవైపూ, ఈ ప్రపంచంలోనే బాధ్యతో జీవించాలనే ఆమె మాటలు మరొకవైపూ నాలో గొప్ప సంఘర్షణ రేకెత్తించాయి.
ఆ రోజుల్లోనే మా కాలేజీకి శ్రీనివాసరెడ్డిగారు ప్రిన్సిపాలుగా వచ్చారు. అత్యంత నిజాయితీపరుడు, సత్యసంధుడు. పూర్తిగాంధేయవాది. ఆయనవల్లా, ఆయనమాటలవల్లా నాలో గాంధీజీ పట్ల కొత్త కుతూహలం రేకెత్తింది. ఒకసారి ఆయన కాలేజీలో గాంధీక్విజ్ నిర్వహించాలనుకుని ఆ బాధ్యత నాకప్పగించారు. నిజాయితీగా ఆలోచించడం, నిజాయితీగా బతకడం అనే రెండు గొప్ప విలువల్ని ఆయన చాలా సరైన సమయంలో నాకు నూరిపోసారని చెప్పాలి. బహుశా సాగర్ జీవితం నాకు అందించిన అతి గొప్ప ఉపాదానమదే.
చాలా రోజుల తర్వాత చుక్కారామయ్యగారూ, నేనూ ఒకేవేదిక మీద మాట్లాడుతున్నప్పుడు రామయ్యగారు గురుకుల విద్యావ్యవస్థ గురించి చెప్తూ 'గురుకులాల్లో చదువుకున్న విద్యార్థుల గురించి ఏం చెప్పుకోగలిగినా చెప్పుకోలేకపోయినా వాళ్ళు విలువలకోసం బతుకుతారని మాత్రం చెప్పగలం 'అంటూ, 'అందుకు ఉదాహరణ ఇదిగో మా వీరభద్రుడే ' అన్నారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు శ్రీనివాసరెడ్డిగారే మదిలో మెదిలారు.
ఇన్నాళ్ళ తరువాత సాగర్ కళాశాల గురించి తలుచుకున్నప్పుడు నాకు రెండు విరుద్ధాంశాలు గుర్తొస్తూ ఉన్నాయి. నా చదువుకీ, ఉద్యోగానికీ సంబంధించిన కెరీర్ కి ఆ కళాశాల నాకేమీ సహకరించలేకపోయింది. కాని అక్కడ నాకెదురైన ఆ అనుభవాలే తటస్థించకపోయిఉంటే నేనొక రచయితగా మారిఉండేవాణ్ణా, జీవితంలో విలువలకి కట్టుబడి ఉండటం అన్నిటికన్నా ముఖ్యమని నమ్మి ఉండేవాణ్ణా అన్నది చెప్పలేను.

A poem for today:


5) 
A poem for today:
అంతా ఆదమరిచినిద్రపోయే అర్థరాత్రి
బయటకివచ్చిచూడు
మామిడిచెట్ల కొమ్మలమధ్య మాఘమాసపుగాలి
ఊయెల్లో పసిపాపలాగా
కనులరమోడ్చి తనలోతనే
నవ్వుకుంటూ కనిపిస్తుంది.

ఎవరూ సొంతంచేసుకోని ఆ చివరిజాము రాత్రి
చంద్రుడొక్కడూ నాకోసం వేచిఉంటాడు
ఒక అనార్ద్ర లోహశకలంలాంటినన్ను
అయస్కాంతశిలలాగా అతడు తాకగానే
చేతుల్లాగా ప్రాణాలు చాపి
రాత్రంతా ఆకాశాన్ని పట్టుకు వేలాడుతుంటాను.
లోయలో సెలయేటివద్ద
రాత్రి చిరుతపులులు నీళ్ళుతాగేటప్పుడు
ఈ చంద్రుడే కదా ఒక కంటకనిపెట్టి ఉంటాడు
అందుకని నా మనోకాననంలో కూడా
ఒక దివ్వెనట్లా
ఎప్పటికీ వెలిగించిపెట్టుకుంటాను.
రైల్లో ప్రయాణీకురాలు
తెల్లవారుతూనే అన్నిటికన్నాముందు
జుత్తు దువ్వుకుని జడవేసుకున్నట్టు
నేను కూడా వేకువకాగానే
రాత్రంతా చిక్కుముళ్ళు పడ్డ నా తలపుల్నిట్లా
ఒద్దిగ్గా ఒక పక్కకు అల్లుకుంటాను.
6) 
A poem for today:
మాఘమాసపు అడవి ఎదట నేను మళ్ళా
పదేళ్ళ బాలుణ్ణి కావాలని ఉంది.
పాతికేళ్ళ యువకుణ్ణి కూడా.
చెట్లు ఆకులు రాలుస్తుండే దృశ్యం
చూస్తూనే ఒక జీవితకాలం గడిచిపోయింది.
కృష్ణదేవిపేట ఏడొంపులఘాటి
కాకరపాడునుంచి బోయపాడువెళ్ళే డొంకదారి
గుమ్మలక్ష్మిపురం, కెరమెరి,నల్లమలకొండల్లో
ప్రతి ఒక్కచోటా మాఘమాసం
నా చిన్నప్పటి నల్లజీడిచెట్లతమకంతో
నన్ను హత్తుకుంటూనే ఉంది
ప్రేమించాను,పోరాటం చేసాను
ఊడిగంచేసాను, ఉమ్ములు మోసాను
జీవితవాంఛ కొడిగట్టినప్పుడల్లా
ఒత్తి కత్తిరించి నన్ను సరిచేసే
దివ్యమానుషహస్తాలెక్కడని పరితపించాను.
ప్రపంచంతో రాజీపడలేను
అలాగని ఒదులుకోలేను
ఎప్పటికప్పుడు చిక్కుముడి పడుతున్న
నా మనోపాశాన్ని సరిదిద్దే
ఒక కేశపాశం కోసం
కలలుకనకుండా ఉండలేను.
ఇప్పుడిక్కడ నా ఇంటివాకిట
రోజంతా రాలుతున్న మామిడిపువ్వు
గతించిన జీవితం తీపినిచ్చిందో, చేదువిరిగిందో
రేపు తెలుస్తుందని నమ్ముతూ
నిద్రలేని ప్రతిరాత్రినీ ఈదుకొస్తున్నాను.
విస్ఫారితనేత్రాలతో ఒక అడవినో, కడలినో
తొలిసారిచూసినట్టు
ఈ ప్రపంచాన్ని చూడాలని సాధన చేస్తున్నాను.
బహుశా నన్ను నన్నుగా అంగీకరించే
కాలం, దేశం, నేస్తం కనిపించినప్పుడే
నా చిన్నప్పటి మాఘసూర్యకాంతి
మళ్ళా నా చేతికి చిక్కుతుందనుకుంటాను.
7) 
A poem for today:
రాజు మిళిందుడు నాగసేనుణ్ణి అడిగాడు: 'మనసు లక్షణమేమిటి, ప్రజ్ఞ లక్షణమేమిటి?'
'పట్టుకోవడం మనసు స్వభావం, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావం ' అన్నాడు నాగసేనుడు.
'పట్టుకోవడం మనసు స్వభావమెట్లా అయ్యింది, తెంచుకోవడం ప్రజ్ఞ స్వభావమెట్లా అయ్యింది?, 'అని అడిగాడు రాజు. 'ఒక ఉదాహరణ చెప్పు 'అన్నాడు:
'రాజా మీరెప్పుడైనా గోధుమపంట కోతలు కొయ్యడం చూసారా?'
'చూసాను.'
'ఆ పంటపొలాలు ఎట్లా కోత కోస్తారు?
'ఎడమచేత్తో నాలుగైదు వెన్నులు పట్టుకుంటారు, కుడిచేత్తో కొడవలి తీసుకుంటారు, దాంతో పంటకోస్తారు.'
'సరిగ్గా అలానే ప్రభూ, మనసుతో పట్టుకోవాలి, ప్రజ్ఞతో తెంచుకోవాలి 'అన్నాడు నాగసేనుడు.
-మిళిందపన్హ 2.1.8 (32-33)
పట్టుకున్నంతకాలం పట్టుకునే ఉండిపోయాను
తెంచుకోవాలనుకున్నప్పుడు పరపరా తెంపేసాను
రెండింటిలోనూ శాంతిలేదు,
దట్టంగా అల్లుకున్న పొగ తప్ప.
నువ్వు పట్టుకున్నప్పుడల్లా
ఒక సీతాకోకచిలుక నీ వేళ్ళ మధ్య
గిలగిలకొట్టుకుంటూనే ఉంది
ఒక తూనీగ విలవిల్లాడుతూనే ఉంది.
నువ్వు వదిలిపెట్టేసినప్పుడల్లా
ఒక కుక్కపిల్ల ముణగదీసుకుని
చలిలో వణుకుతూనే ఉంది.
పంజరం తలుపులు తెరిచినా
పావురం బయటికి పోలేకుంది.
నువ్వెవరినైనా ప్రేమించడమంటే
నీకు నిష్కారణంగా దయకలగడం
కాని ప్రేమ కొనసాగాలంటే
నువ్వు నిర్దయకూడా నేర్చుకోవాలి.
8) 
An Afternoon in Agra…
A poem by Vadrevu Chinaveerabhadrudu
(Translated by Sri Nauduri Murty)
That was an afternoon in Agra
As the late sagittal sun
Prevailed up to the welkin.
Like the tang of tart of a fruit,
There was a mild bite in it.
That ageless dream… Taj Mahal … looked as if
Somebody had set it over this earth only yesterday.
The marmoreal Minars were
Splendid in the hoary afternoon sun.
Another generation of admirers
Lie in front of her spellbound.
In the lawn in front of me there was a flower
And a Bumble Bee was hovering over its antheral centre.
The bee for the flower
And the flower for the bee…
My eyes were feasting on
The essay of their meetings and partings.
Endlessly … people were flocking around
The delectable monument with cameras in hand.
There was an invincible flower
In front of me this afternoon.
That might wither by the end of the day.
But here was a Bumble bee
Tipsier with love than Shah Jahan.
.
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
.
ఆకాశమంతటా ఆవరించిన
మలిహేమంతపు ఎండలో
ఆగ్రాలో ఒక మధ్యాహ్నం
పండులో పుల్లదనంలాగా చలి.
పురాతన స్వప్నం తాజమహల్ ఎవరో
నిన్నరాత్రే భూమ్మీద ప్రతిష్ఠించినట్టుంది.
మెరిసిపోతున్న పాలరాతి గుమ్మటాలు
ధవళ అపరాహ్ణశోభలో.
సాగిలబడుతున్నారు దాని ఎదట
కొత్త ఆరాధకులు మరికొందరు.
నా ఎదట పచ్చికలో పుష్పం
దాని పరాగకేంద్రంలో ఒక భ్రమరం
పుష్పంకోసం భ్రమరం
భ్రమరంకోసం పుష్పం
వాటి మిలన పునర్మిలనాలతో
నా కళ్ళు పండుగ చేసుకున్నాయి.
మూగుతూనే ఉన్నారు మనుషులు
కెమేరాల్తో ఆ రమ్యమహల్ చుట్టూ
ఈ మధ్యాహ్నం నా ఎదట
దినాంతానికి రాలిపోయే
అజేయ పుష్పం. షాజహాన్ కన్నా
ప్రేమోన్మత్త భ్రమరం.

10) 
కవిత
ఫిబ్రవరి రాగానే మంకెనలు పూస్తాయనుకునేవాణ్ణి,కాదుమంకెనలు మొగ్గతొడుగుతూనే
ఒక మాఘమాసాన్ని సృష్టిస్తాయి.
నిండుగా పూసినమంకెనలచుట్టూ
నీలిపొరలు,ఊదారంగుధూళి-
నా బాల్యంలో పూర్తిగా వినలేకపోయిన
పాటలన్నీ మళ్ళా అక్కడ ప్రత్యక్షమవుతాయి.
నేను తిరిగిన కొండలదారుల్లో
రాలిన ఇప్పపూలు,నల్లజీడిచెట్లు,తపసిమాకులు-సంతనుంచి ఆవును పల్లెకు తీసుకుపోతున్న రైతులా
మాఘమాసం నన్ను నగరంనుంచి అడివికి తీసుకుపోతుంది.
ఇన్నేళ్ళుగా ఎంతో ప్రయత్నించాను
మరొక కొత్త దృశ్యమేదన్నా నన్ను ప్రలోభపరుస్తుందని వేచి చూసాను
నన్ను మైమరిపించగల ఒక మనిషి ఉనికికోసం
నా జీవితం సర్వం సమర్పించడానికి సిద్ధపడ్డాను
పూసినమంకెనచెట్లు కనబడగానే
ప్రపంచంనాకు నేర్పిన పాఠాలన్నీమర్చిపోతాను
రంగులెట్లా కలపాలో ఎంతసాధనచేసినా
రంగులపళ్ళెం ముందు నిలబడ్డప్పుడు తొట్రుపడ్డట్టే
మాఘమాసం ఎదట నేను మూగబోతాను.
వందేళ్ళ తరువాత ఒక పిపాసి
ఇప్పటి మనుషులు ద్వేషించుకోడందూషించుకోడంకాకుండా
మరేమన్నా చేసారా అని అనుకున్నప్పుడు
చినవీరభద్రుడు మంకెనల ఎదట 
మూర్ఛపోయాడని  కవిత గుసగుసలాడుతుంది.

Total Pageviews